తుఫానుకు నవంబర్ మాసానికి ఏదో తెలియని సంబంధం ఉంది. అన్ని ప్రాంతాల్లో సెప్టెంబర్ నెల నుంచే వర్షాలు కురిసినా.. కోస్తా ప్రాంతాలలో మాత్రం కేవలం నవంబర్ లో వర్షాలు వస్తాయి. దానికి తోడు అదే నెలలో తుఫాన్లు కూడా కచ్చితంగా జిల్లాను పలకరిస్తాయి. కొన్ని సార్లు ఈ తుఫాన్లు గట్టిగానే ప్రభావం చూపినా.. మరికొన్నిసార్లు సైలెంట్ గా వెళ్లిపోతాయి. అయితే ఈ ఏడాది నవంబర్ లో వచ్చే తుఫాన్లు తీరప్రాంత జిల్లాలను వదిలేలా లేవు.తాజాగా ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వాహణ సంస్థ ప్రకటించింది.ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని పేర్కొంది.
48 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ
ఇది పశ్చిమ – వాయవ్య దిశగా కదులుతూ ఈ నెల 24 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. ఆ తరువాత 48 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతంలో మరింత బలపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో ఈనెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోందిఇప్పటి వరకూ అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తే.. నవంబర్ గండం నెల్లూరుకు ఈ ఏడాది కూడా తప్పేలా కనిపించడం లేదు. మొంథా తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలను మరిచిపోకముందే ఇప్పుడు మరో ఉపద్రవం తరుముకుంటూ వస్తోంది. ఏది ఏమైనా.. నవంబర్ నెల వచ్చిందంటే చాలు.. నెల్లూరు జిల్లా ప్రజలు భయపడిపోతున్నారు.
ఇవి కూడా చదవండి.
ఒక రోజైన కాకముందే విగతజీవిగా పెళ్ళికొడుకు
ఇదేమి కోరిక తాతయ్యా , విచిత్రంగా ఉందే..
భర్తలు ఇంట్లో, భార్యలు బస్సులో..ఉచితం ఎఫెక్ట్.

