22.5 C
New York
Saturday, April 4, 2026

Latest Posts

మక్కాయాత్రలో తెలంగాణ వాసుల బస్సు దగ్ధం

సౌదీ అరేబియాలో భారతీయ యాత్రికులతో ఉన్న బస్సు ప్రమాదంలో బస్సులో ఉన్న అందరూ చనిపోయారని చెబుతున్నారు. భారతీయ కాలమానం ప్రకారం ఈ ప్రమాదం రాత్రి ఒంటి గంట, ముప్పై నిమిషాలకు సోమవారం జరిగింది. మక్కాలో యాత్ర పూర్తిచేసుకుని , మదీనాకు పోతుండగా ఈ దుర్ఘటన జరిగింది. మొత్తం 42 మంది మృతులలో 20 మంది మహిళలు ,11 మంది పిల్లలు ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. బస్సు నేరుగా డీజిల్ ట్యాంకర్ ని ఢీకొట్టిందని , ఫలితంగా రెండు వాహనాలు కాలిపోయాయని చెబుతున్నారు. దాదాపుగా బస్సులో ప్రయాణిస్తున్న వారందరూ చనిపోయారని తెలుస్తోంది. . ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని. అందులో హైదరాబాద్ వాసులు కూడా ఉన్నారని మీడియా వార్తలు వచ్చాయి.

బస్సు ఒక డీజిల్ ట్యాంకర్ ని ఢీకొనడంతో ప్రమాదం

ఈ ప్రమాదంలో కనీసం 42 మంది చనిపోయారని మీడియా కథనం. బస్సు ఒక డీజిల్ ట్యాంకర్ ని ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. వెంటనే స్పందించిన సీఎం పూర్తి వివరాలు తెలుసుకోవాలని సీఎస్, డీజీపీ ని అదేశించారు. తెలంగాణ కు చెందిన వారు ఎంత మంది ఉన్నారని ఆరా తీశారు. కేంద్ర విదేశాంగ శాఖ, సౌదీ ఎంబస్సీ అధికారులతో మాట్లాడాలని సూచించారు. అవసరమైతే వెంటనే తగిన సహాయక చర్యలకు రంగంలోకి దిగాలని అదేశించారు . సీఎం అదేశాలతో సీఎస్ రామకృష్ణారావు ఢిల్లీ లో ఉన్న రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ను అప్రమత్తం చేశారు. ప్రమాదం లో మన రాష్ట్రానికి చెందిన వారు ఎంత మంది ఉన్నారనే వివరాలు సేకరించి వెంటనే అందించాలని అదేశించారు. సచివాలయం లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి.

ఒక రోజైన కాకముందే విగతజీవిగా పెళ్ళికొడుకు

ఇదేమి కోరిక తాతయ్యా , విచిత్రంగా ఉందే..

భర్తలు ఇంట్లో, భార్యలు బస్సులో..ఉచితం ఎఫెక్ట్.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.