బంతి మాదిరి ఉన్న ఈ పువ్వు పురాణ మరియు ఆధ్యాత్మిక పరంగా ప్రాశస్త్యం చెందినది. అమ్మవారి ఆలయాల్లో ముఖ్యంగా మీనాక్షి అమ్మవారి ఆలయంలో దీనిని అమ్మవారి పుష్పంగా భావిస్తారు. అమ్మవారి కదంబవనంలో ఇది ప్రధాన పుష్పం. ఇది పెద్ద వృక్షంగా పెరిగి .దీని పుష్పాలు గుండ్రంగా బంతి వలె అందంగా ఉంటాయి. వీటిని లలితాదేవి పూజలో ప్రముఖంగా ఉపయోగిస్తారు.. కదిరియమ్మన్ పూజలలో కూడా కదంబం బంతి పుష్పాలు వినియోస్తారు. వీటిని లలితాదేవి పూజలో ప్రముఖంగా ఉపయోగిస్తారు.
కదంబోత్సవం అనేది కేరళలో జనాదరణ పొందిన రైతుల పండుగ.. దీనిని భాద్రపద శుద్ధ ఏకాదశి నాడు జరుపుకుంటారు. ఆ రోజున కదంబ వృక్షపు కొమ్మను ఇంటికి తెచ్చుకొని పూజిస్తారు. ఆనాటి సాయంత్రం ఈ పూల రెక్కల్ని బంధువులు, స్నేహితులకు పంచుకుంటారు.
కదంబ పుష్పాన్ని దేవతాపుష్పంగా భావిస్తారు
ఈ పండుగను ఓనం నాడు కేరళ ప్రజలు, తుళు ప్రజలు కొంత తేడాగా జరుపుకుంటారు. కర్ణాటక, కేరళ సరిహద్దులో రెండు రాష్ట్రాల ప్రజలు మిశ్రమ సాంప్రదాయంలో ఉన్నవారిని తుళు ప్రజలు అంటారు. అనాదిగా ఈ సరిహద్దుల ప్రాంతాన్ని తుళు నాడుగా వ్యవహరిస్తారు. వీరికి తుళు ప్రత్యేకబాష.. యక్ష గాన కళల్లో ఆరితేరినవారు. వీరు కదంబ పుష్పాన్ని దేవతాపుష్పంగా భావిస్తారు. జ్యోతిష శాస్త్రంలో నక్షత్రాలు ఒక్కొక్క దానికి ఒక వృక్షాన్ని గుర్తించారు. నక్షత్రవనం లో కదంబ వృక్షాన్ని శతభిష నక్షత్ర స్థానంలో ఉంచుతారు.. అందువల్ల జ్యోతిష్యశాస్త్ర పరంగా కూడా దీనికి విశేష స్తానం ఉంది.. ఈ పుష్పం విలువ తెలియని వారు దీనిని అలంకరణకోసం పెంచుతారు.
ఇవి కూడా చదవండి.
ఒక రోజైన కాకముందే విగతజీవిగా పెళ్ళికొడుకు
ఇదేమి కోరిక తాతయ్యా , విచిత్రంగా ఉందే..
భర్తలు ఇంట్లో, భార్యలు బస్సులో..ఉచితం ఎఫెక్ట్.

