22.5 C
New York
Wednesday, December 10, 2025

Latest Posts

సాక్షులే ఎందుకు చనిపోతున్నారు శ్రీవివాసా ?

వివిధ రకాల క్రిమినల్ కేసుల్లో నిందితుల అనుమానాస్పద మరణాలు రాష్ట్రంలో సంచలనం కలిగిస్తున్నాయి . గతంలో పరిటాల రవి మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డి, మొద్దు శీను హత్య కేసులో నిందితులనుంచి ,వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులవరకు అనుమానాస్పద మరణాలు ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలే. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుల వరుస మరణాలు, కీలక నిందితులకు రాజకీయ రక్షణ..ఇవన్నీ కూడా ప్రజలకు తీరని సందేహాలే. తాజాగా తిరుమలలో హుండీ డబ్బు లెక్కించే పరకామణిలో అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ గా పనిచేసిన సతీష్ కుమార్ అనుమానాస్పద మరణం వరకు అన్ని మిస్టరీగానే మిగిలిపోతున్నాయి. ఆయన ఇప్పుడు రైల్వే ఇన్స్పెక్టర్ గా గుంతకల్ లో ఉన్నారు. వైసిపి హయాంలో ఆయనకు డిప్యుటేషన్ పై హుండీ సెక్షన్ ఏవీఎస్వో గా పోస్టింగ్ ఇచ్చారు. నవంబర్ 14 తేదీన సతీష్ కుమార్ గుంతకల్ లో ఫస్ట్ క్లాస్ కంపార్ట్ మెంట్ లో హుండిచోరీ కేసులో విచారణకు తిరుపతికి రావాలని ఎక్కాడు.

శ్రీవారి హుండీ చోరీ కేసులో దొంగతో రాజీ ఏమిటయ్యా ?

తాడిపత్రి దగ్గర రైలు పట్టాలపక్కన అతడి శవం పడిఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం లో గతంలో ఏవీఎస్ వోగా పనిచేసిన రైల్వే ఇన్స్పెక్టర్ అనుమానాస్పద మరణం ఇప్పుడు రాజకీయంగా వైసిపి మెడకు చుట్టుకుంటుంది .ఇలాంటి కేసుల్లో తొందరపడి వైసిపి నాయకులు స్పందించడమే వారికి ఇబ్బందిగా తయారవుతుంది. తిరుమల హుండీనుంచి వందలకోట్లు దొంగతనం చేసిన కేసులో చనిపోయిన టీటీడీ మాజీ ఏవిఎస్వో కీలక వ్యక్తి,.  ఆయనే హుండీ చోరీకేసును దర్యాప్తు చేసారు. 2023 లో ఈ కేసులో రవికుమార్ అనే గుమస్తాను అరెస్ట్ చేసారు. ఆ తరువాత లోపాయికారీగా ఏమిజరిగిందో ఏమో, అతడినుంచి కొన్ని ఆస్తులు టిటిడికి రాయించుకుని , కేసు లోక్ అదాలత్ లో పెట్టి రాజీచేసుకుని , అతడిని వదిలేసారు. ఇక్కడే అప్పటి వైసిపి పాలకులు ఘోరమైన తప్పిదం చేసారు. భక్తులు వేసే హుండీ డబ్బులు కోట్లలో కాజేసిన వ్యక్తిమీద కేసులేకుండా రాజీ చేయడం ఏమిటని ఎవరైనా నిలదీయగలరు. కానీ లోపాయికారీగా అతడు నుంచి చెన్నైలో ఉన్న వందల కోట్లు ఆస్తులు రాయించేసుకుని , అప్పటి ప్రభుత్వంలో , టిటిడిలో పెద్ద ఈ దారుణం చేశారన్నది ఆరోపణ.

వివేకా కేసులో సాక్షలు చనిపోయారు , అలాగే ఇది కూడానా ?

ఈ విషయంలో ఇప్పుడు చనిపోయిన సతీష్ కుమార్ హుండీ దొంగ రవికుమార్ తో మాట్లాడి రాజీ చేసి, ఆస్తులు రాయించేట్టు ఒప్పందం చేసాడన్నది ఆరోపణ. హుండీ చోరీ కేసు రాజీపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇంత దారుణమైన నేరాన్ని ఎలా రాజీ చేస్తారని, లోక్ అదాలత్ లో ఈ కేసుఎలా చేస్తారని నిలదీసింది. దీనిపై సిఐడి విచారణకు ఆదేశించింది. సిఐడి మృతుడు సతీష్ కుమార్ ని రెండు సార్లు విచారించింది. మూడో దఫా విచారణకు అతడు రైలులో వస్తుండగా  రైలు కిందపడి చనిపోయినట్టు వార్త గుప్పుమంది. బంధువులు వైసిపి నాయకుల కుట్ర కారణంగానే అతడు చనిపోయాడని , వాళ్ళే చంపేశారని , హుండీ చోరీ కేసులో తమ బండారం బట్టబయలవుతుందని ఉద్దేశంతోనే సతీష్ కుమార్ ని చంపేశారని చెబుతున్నారు. వైసిపి నేతలేమో , టీడీపీ నేతలు జోక్యంతో విచారణ అధికారులు మానసికంగా పెట్టె చిత్రహింసలు భరించలేకనే అతడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని ఆరోపిస్తున్నారు.. ఏది నిజమో ఏడుకొండలవాడికే తెలియాలి.

ఇవి కూడా చదవండి.

ఒక రోజైన కాకముందే విగతజీవిగా పెళ్ళికొడుకు

ఇదేమి కోరిక తాతయ్యా , విచిత్రంగా ఉందే..

భర్తలు ఇంట్లో, భార్యలు బస్సులో..ఉచితం ఎఫెక్ట్.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.