వరల్డ్ ఫేమస్ యాపిల్ కంపెనీ మరో కొత్త ప్రోడక్ట్ ని మార్కెట్లోకి లాంచ్ చేసింది. అయితే ఈ సారి యాపిల్ విడుదల చేసిన ప్రోడక్ట్ నిజంగానే కొత్తగా కనిపిస్తోంది. ఈ ప్రోడక్ట్ పేరు “ఐ ఫోన్ పాకెట్”. మన ఐ ఫోన్ పెట్టుకునేందుకు యాపిల్ ఈ ప్రోడక్ట్ తీసుకొచ్చింది. ఐ ఫోన్ చేతిలో పట్టుకోకుండా.. ఇక నుంచి ఈ ఐ ఫోన్ పాకెట్ లో పెట్టుకొని ఎంచక్కా ఎక్కడికైనా వెళ్లిపోవచ్చు.ఏ రకమైన ఐ ఫోన్ మోడల్స్ అయినా ఐ ఫోన్ పాకెట్ లో పెట్టుకునేలా దీన్ని రూపొందించారు. ఫోన్‌తో పాటు చిన్న వస్తువులు కూడా ఇందులో పెట్టుకోవచ్చు. ఈ ఐ ఫోన్ పాకెట్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. మొదటి దాని ధర 229 డాలర్లుగా చెబుతున్నారు. అంటే మన కరెన్సీలో దాదాపుగా 20 వేలకు పైమాటే.మరొకటి 149 డాలర్లు..దీని విలువ మన కరెన్సీలో 13 వేల రూపాయలుగా ఉంది.
నవంబర్ 14 నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో
జపాన్ డిజైనర్ ఇస్సే మియాకేతో కలసి యాపిల్ ఈ ప్రోడక్ట్ ను డిజైన్ చేసినట్టు పేర్కొంది. లిమిటెడ్ ఎడిషన్‌గా డెవలప్ చేసిన ఈ ఐ ఫోన్ పాకెట్ వివిధ రంగుల్లోనూ లభ్యమవుతుంది. నవంబర్ 14 నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. అదే విధంగా అమెరికా, ఫ్రాన్స్, చైనా, ఇటలీ, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, యుకేలలోని ఎంపిక చేసిన యాపిల్ స్టోర్స్ లో విక్రయానికి అందుబాటులో ఉంటుందని యాపిల్ ప్రకటించింది.ఇదిలా ఉండగా ఈ ప్రోడక్ట్ గురించి సోషల్ మీడియాలో నెటిజన్లు పంచులు పేలుస్తున్నారు. 50 రూపాయల సాక్స్ ని డిజైన్ చేసి.. బ్రాండ్ పేరు చెప్పి.. 20 వేలకు అమ్మేస్తారా అంటూ మీమ్స్ చేస్తున్నారు. అసలే అవసరం లేకపోయినా.. బిల్డప్ కోసం.. పిచ్చిపిచ్చిగా యాపిల్ ఫోన్లు కొనేసే మన పిచ్చిజనం దీన్ని కూడా కొంటారా లేదా చూడాలి.
ఇవి కూడా చదవండి.
ఒక రోజైన కాకముందే విగతజీవిగా పెళ్ళికొడుకు

