సృష్టిలో అన్ని ప్రాణాలకంటే కన్నప్రేమ గొప్పది. మనుషులకైనా , జంతువులకైనా , పక్షులకైనా .. తల్లి ప్రేమని వేరే ఏ ప్రేమతో పోల్చలేరు. అయితే అప్పుడప్పుడు మనుషుల మనసులోనే కన్న ప్రేమకు మరకలు అంటుకుంటాయి.. అలాంటిదే ఇది. కన్నకొడుకుని హత్య చేయించడానికి సుపారీ గ్యాంగ్ తో 6 లక్షలకు బేరం కుదుర్చుకున్న తల్లి ఉదంతమిది .అన్నమయ్య జిల్లా గుడిసవారిపల్లి యువకుడి హత్య కేసులో 8 మంది నిందితులను అరెస్టు చేసిన బి.కొత్తకోట పోలీసులు ఈ హత్య కోణంలో తల్లిని కుట్రదారుగా గుర్తించారు. ఈనెల 7వ తేదీన గొల్లపల్లి వద్ద హత్యకు గురైన జయప్రకాశ్ రెడ్డి అనే 20 ఏళ్ళ యువకుడు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఎంబీఏ రెండవ సంవత్సరం చదువుతున్నాడు.
అడ్వాన్స్ రూపంలో 50 వేల రూపాయలను నిందితులకు ఇచ్చి
తన వ్యవసాయ పొలంలో పనిచేస్తున్న మహేష్ అనే యువకుడితో సుపారి ఒప్పందం కుదుర్చుకుని ఆమె ఈ ఘాతుకానికి పాల్పడింది. హత్య చేయించడానికి మహేష్ సాయంతో సుపారీ గ్యాంగ్ తో 6 లక్షలకు బేరం కుదుర్చుకున్న తల్లి శ్యామలమ్మ , అడ్వాన్స్ రూపంలో 50 వేల రూపాయలను నిందితులకు ఇచ్చి శ్యామలమ్మ మిగిలిన డబ్బు హత్య అనంతరం ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. హత్యకు పాల్పడినటువంటి యువకులందరూ 25 సంవత్సరాల లోపు ఉన్నవారని బి.కొత్తకోట పోలీసులు చెప్పారు. హత్యకు ఉపయోగించినటువంటి బేస్బాల్ స్టిక్, రెండు ద్విచక్ర వాహనాలు, ఒక బొలెరో వాహనాన్ని పోలీసులు.స్వాధీనం చేసుకున్నారు. తల్లితో సహా 8 మంది నిందితులను కోర్టులో హాజరపరచనున్న బి.కొత్తకోట పోలీసులు.
ఇవి కూడా చదవండి.
ఒక రోజైన కాకముందే విగతజీవిగా పెళ్ళికొడుకు

