22.5 C
New York
Friday, April 3, 2026

Latest Posts

టాటా బైక్ వస్తుందా..? వస్తే రేటెంత.?

టాటా బైక్ వస్తుందా..? వస్తే రేటెంత..?? 18, 099 రూపాయలని సోషల్ మీడియా కోడి కూసినట్టు కూస్తోంది.. అయితే ఇవన్నీ అబద్దాలే. సోషల్ మీడియా కట్టుకథలే. టాటా మోటార్స్ నుంచి అలాంటి బైక్ ఏదీ వచ్చే ప్రత్రిపాదనేలేదు. మరీ విచిత్రం ఏమిటంటే అసలు టాటా మోటార్స్ లో బైక్ ల తయారీకోసం ప్లాంట్ లేదు.. అలాంటి ఆలోచేనే లేదు.

మైలేజి, ధర , డిజైన్ ఇలా అన్నింటినీ నిర్ణయించేసి

అయితే మన సోషల్ మీడియా మాత్రం కాకమ్మ కబుర్లు చెప్పేస్తూ దాని మైలేజి, ధర , డిజైన్ ఇలా అన్నింటినీ నిర్ణయించేసి ఊదరగొట్టేస్తోంది. కంపెనీ మాత్రం అసలు ఆ ఊసే ఎత్తడంలేదు. నూటికి నూరుశాతం టాటా నుంచి బైక్ వచ్చే ఆలోచన లేకపోయినా మన సోషల్ మీడియా మేధావులు మాత్రం దాని ఫొటోలు కూడా పెట్టేసి ఆహా, ఓహో అంటూ సమీక్షలు కూడా రాసేస్తున్నారు. అసలు పెళ్లికాకుండానే పుట్టే బిడ్డకు పేరుపెట్టినట్టు పుకార్లు మాత్రం షికారు చేస్తున్నాయి.

ఈ వార్త‌ల్లో ఏమాత్రం నిజం లేద‌ని టాటా తేల్చి చెప్పింది.

అయితే టాటా బైక్స్ పై ఇలాంటి ప్రచారం ఇది మొదటి సారి కాదు. ఇంతకు ముందు కూడా “టాటా నానో ఎలక్ట్రిక్ కార్” వస్తోందంటూ చాలా వార్తలు వచ్చాయి. కొన్ని మీడియా సంస్థ‌లు కూడా ఈ వార్త‌ల‌ను ప్ర‌చురించాయి. దీంతో అప్పట్లో ఈ వార్త‌ల‌పై టాటా అధికారికంగా స్పందించింది. ఈ వార్త‌ల్లో ఏమాత్రం నిజం లేద‌ని టాటా తేల్చి చెప్పింది. అయితే ఇప్పుడు టాటా కంపెనీ బైక్స్ గురించి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీన్ని బట్టి చూస్తే టాటా బైక్స్ కేవలం గాలి వార్త మాత్రమేనని చెప్పడంలో సందేహమే లేదు.

ఇవి కూడా చదవండి.

ఒక రోజైన కాకముందే విగతజీవిగా పెళ్ళికొడుకు

ఇదేమి కోరిక తాతయ్యా , విచిత్రంగా ఉందే..

భర్తలు ఇంట్లో, భార్యలు బస్సులో..ఉచితం ఎఫెక్ట్.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.