22.5 C
New York
Wednesday, December 10, 2025

Latest Posts

ఉద్యోగానికి రోజూ విమానంలోనే ప్రయాణం

మహిళలు ఇల్లు చక్కదిద్దుకునే విధానం, ఇంటిని నడుపుకునే పద్ధతి, పొదుపులో వారు అవలంబించే కిటుకులు .. ఇవన్నీ కూడా బిజినెస్ మానేజ్మెంట్లో ముఖ్యమైన అంశాలే . బిజినెస్ మేనేజ్మెంట్ చదివే విద్యార్థులకు వీటిని కూడా నేర్పిస్తారు . మహిళల చేత లెక్చర్లు కూడా ఇప్పిస్తారు . మహిళ తానూ ఉద్యోగం చేస్తూ, పిల్లల్ని చదివించుకుంటూ వారి ఆలనాపాలనా చూసుకుంటూ ఇంటి బాధ్యతలను సమర్ధవంతంగా చూసుకుంటూ ఎలా పనిచేస్తుందో, ఎలా తన జీవితాన్ని తన కుటుంబ జీవితాన్ని చక్కదిద్దుతుందో ఒక నిదర్శనంగా నిలిచింది ఓ ఇల్లాలు. మలేషియాలోని పెనాంగ్ అనే ప్రాంతంలో ఉన్న ఈ మహిళ తన ఉద్యోగానికి ప్రతిరోజు విమానంలోనే పోతుంది . ఒక ఉద్యోగి ప్రతిరోజు విమానంలో పోవడం ఇదేదో రైల్లో ,బస్సు కాదు. స్కూటీ అంతకంటే కాదు .

అక్కడ ఇంటి అద్దె కంటే రోజూ విమానయానమే చౌక

ఆమె పెనాంగ్ నుంచి తానూ ఉద్యోగం చేసే కౌలాలంపూర్ కి రోజు విమానంలో ప్రయాణం చేస్తోంది. ఆసియన్ ఎయిర్ లో అసిస్టెంట్ మేనేజర్ గా ఉన్న రాచల్ కౌర్ ఉదయాన్నే నాలుగు గంటలకు నిద్ర లేస్తుంది. ఐదున్నరకల్లా తన పనులన్నీ ముగించుకుని పిల్లల్ని ముస్తాబు చేసి ఆరు గంటల కు పిల్లల్ని స్కూల్లో వదిలేసి, ఫ్లైట్లో కౌలాలంపూర్ కి పోతుంది . అక్కడ ఉద్యోగం ముగించుకుని మళ్ళీ ఆరు గంటలకు పెనాంగ్ కి వచ్చేస్తుంది . ఆ తర్వాత ఇల్లు, పిల్లలు బాగోగులను చూసుకుంటుంది. ఇందులో మీకో అనుమానం రావచ్చు . ఆమె జీతం ఎక్కువేమీ కాదు. కాకపోతే ఇలా కష్టపడి పనిచేయడం విమానం ఖర్చులు భరిస్తూ ప్రతిరోజు రావడానికి పోవడానికి ఆమె విమానం టికెట్ కొనుక్కొని పోవాలి . అయితే ఇందులో కిటుకుంది. ఓ పొదుపు మంత్రం ఉంది . అదే బిజినెస్ మేనేజ్మెంట్ లో మహిళల సమర్థత.

పొదుపులో మహిళల మంత్రం ఎంబీఏలో ఒక పాఠం

ఇంటి నిర్వహణలో మహిళల సామర్థ్యం .ఆమె తానూ పనిచేసే కౌలాలంపూర్ లో ఉంటే ఆమెకు కనీసం నెలకు ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 50000 రూపాయలు ఇంటి అద్దె అవుతుంది. అదే పెనాంగ్ లో అయితే 20 వేల రూపాయలకే ఇల్లు అద్దెకు వస్తుంది. మిగతా ఖర్చులు అన్నీ కూడా తన జీతంతో కలుపుకుంటే కౌలాలంపూర్ లో జీవనానికి ఆమెకు వచ్చే జీతం ,పెనాంగ్ లో జీవనానికి చాలా తేడా ఉంటుంది .అందువల్ల ఆమె తన పిల్లలను చదివించుకునేందుకు ఒక బాధ్యత కలిగిన ఇల్లాలుగా ఉద్యోగం ఒక బాధ్యతగల ఉద్యోగం చేస్తూ వీటన్నింటికీ మించి తనకొచ్చే జీతాన్ని ఒక పద్ధతిలో పొదుపు చేసుకునేందుకు ఇలాంటి రోజూ ట్రావెల్ చేస్తుంటారు .పెనాంగ్ లో ఖర్చులకు , కౌలాలంపూర్ లో నివాసముండే ఖర్చులకు చెమ్మకు, ఏనుగుకు ఉన్నంత తేడా ఉంటుంది. అందువల్లనే పొదుపు మంత్రం పాటించి ఆ మహిళ ప్రతిరోజూ విమానంలో పెనాంగ్ నుంచి కౌలాలంపూర్ కి పోతుంది. పైగా మలేషియాలో విమాన చార్జీలు కూడా తక్కువే.. అందుకే ఆ మహిళ ఇలా డైలీ ట్రావెల్ విమానంలోనే చేస్తోంది.

ఇవి కూడా చదవండి.

ఒక రోజైన కాకముందే విగతజీవిగా పెళ్ళికొడుకు

ఇదేమి కోరిక తాతయ్యా , విచిత్రంగా ఉందే..

భర్తలు ఇంట్లో, భార్యలు బస్సులో..ఉచితం ఎఫెక్ట్.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.