బొప్పాయి పండు , ఇటీవల కాలంలో బొప్పాయి వినియోగం ఎక్కువైంది . గతంలో ఇంటి పెరట్లోనే వేసుకునే బొప్పాయి ఇప్పుడు వాణిజ్యపంటగా విపరీతంగా సాగులోకి వచ్చింది. దీనికి కారణం ,బొప్పాయి పండు వలన కలిగే ప్రయోజనాలపై ప్రజలకు సరైన అవగాహన రావడం ,ప్రకృతి సిద్ధంగా లభించే ఈ బొప్పాయి పండు లో ఉన్న ఔషధ గుణాలు ,ఆరోగ్య విలువలు పోషకాల గురించి ప్రజలకు అనుభవంలోకి రావడం .. ఇలాంటివన్నీ కలిపి ఒకప్పుడు పరిమితంగా వాడే ఈ బొప్పాయి పండు ఇప్పుడు వాణిజ్యపరంగా పండించడమే కాకుండా ,దాని వినియోగం కూడా విస్తృతంగా పెరిగింది . ఒకరకంగా ఇది మిగతా పండ్ల కంటే అరటిపండు తర్వాత ఎక్కువ వినియోగంలో ఉన్న పండు బొప్పాయి పండు. అలాంటి బొప్పాయి పండులో ఉన్న పోషకాలు ఆరోగ్య విలువలు ఇప్పుడు శాస్త్రీయంగానే నిరూపితమయ్యాయి
జీర్ణప్రక్రియలో మేలుచేస్తుంది..
బొప్పాయి పండు శారీరిక రుగ్మతలే కాదు ,కొన్ని రకాల సమస్యలను కూడా సమర్థవంతంగా పరిష్కారం చేసే శక్తి కలిగి ఉందని శాస్త్రీయ పరిశోధనలలో తేలింది. బొప్పాయి పండు లో ఉన్న ఒక ఎంజైమ్ జీర్ణశక్తిని పెంపొందిస్తుందని నిర్ధారించారు. దానిలో ఉన్న పోషకాలను విలీనం చేసుకోవడం ద్వారా జీర్ణ సంబంధమైన ఇబ్బందులను బొప్పాయి తొలగిస్తుందని శాస్త్రీయంగా కూడా నిర్ధారించారు . బొప్పాయిలో విటమిన్ సి దండిగా ఉందని ,దీనివల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని , తెల్ల రక్త కణాలు క్రియాశీలకత్వానికి ఇవి బాగా పనిచేస్తాయని తేలింది. శరీరానికి ఒత్తిళ్లు కారణంగా కలిగే ఇబ్బందులను తొలగిస్తుందని తేల్చారు . బొప్పాయిలో లైకోపీన్, బీటా కెరటిన్ , ఫ్లెవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి..
గుండెకు తగినంత బలాన్నిస్తుంది
వీటివల్ల గుండె సంబంధమైన కొన్ని ప్రమాణాలను సరిచేస్తుంది . బొప్పాయి వల్లనే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ క్రమబద్ధం అవుతుందని , గుండెలోని రక్తనాళాల పనితీరును కూడా ఇది మెరుగుపరుస్తుందని ఇలినాయిస్ యూనివర్సిటీ పరిశోధనలో తేలింది . యూనివర్సిటీ పరిశోధనలకు అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థల పరిశోధన కూడా తోడై ఈ రెండు సంయుక్తంగా బొప్పాయి పై పరిశోధన చేశాయి. దీర్ఘకాలం పాటు బొప్పాయి తీసుకుంటున్న వారిలో గుండె సంబంధిత జబ్బులు పెద్దగా ఇబ్బంది కలిగించడం లేదని తేల్చారు. బొప్పాయి లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ పదార్థాలు చర్మ కణాలను అభివృద్ధి చేసి చర్మం కాంతివంతంగా చేస్తాయని, వయసు ప్రభావం చర్మం మీదా పడకుండా చూస్తాయని తేల్చారు.
ఇవి కూడా చదవండి.
ఒక రోజైన కాకముందే విగతజీవిగా పెళ్ళికొడుకు

