22.5 C
New York
Saturday, June 13, 2026

Latest Posts

తీవ్రవాయుగుండం క్రమంగా కదులుతొంది

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్రవాయుగుండం క్రమంగా కదులుతొంది. గడిచిన 6 గంటల్లో గంటకు 5 కి.మీ వేగంతో కదిలిన తీవ్రవాయుగుండం, మరో 12 గంటల్లో నైరుతి, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడుతుంది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. .ప్రస్తుతానికి చెన్నైకి 770 కిలోమీటర్ల దూరం , విశాఖపట్నంకి 820 కాకినాడకి 810 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతం అయిఉంది. సోమ కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, అనకాపల్లి, తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.మిగతా జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చు. బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఏఎస్ఆర్, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీస్తాయి . ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని , అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ. హెచ్చరిస్తోంది.

ఇవి కూడా చదవండి.

ఒక రోజైన కాకముందే విగతజీవిగా పెళ్ళికొడుకు

ఇదేమి కోరిక తాతయ్యా , విచిత్రంగా ఉందే..

భర్తలు ఇంట్లో, భార్యలు బస్సులో..ఉచితం ఎఫెక్ట్.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.