శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉందా..? గత కొన్నేళ్లుగా నాయకుల నిర్లక్యం, అధికారుల అలక్ష్యం భవిష్యత్తులో ఇబ్బందిగా మారనుంది. పొరపాటున జరగ రానిది జరిగితే జలప్రళయం తప్పదు. ఇంతకీ అసలువిషయం ఏమిటంటే డ్యామ్ కి దిగువనే ఉండే ప్లంజ్ పూల్ కారణంగా డ్యామ్ ఉనికి ప్రమాదంలో పడే పరిస్థితి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్లంజ్ పూల్ అంటే నీటి ఉదృతి కారణంగా డ్యామ్స్ , కొండలు, వాటర్ ఫాల్స్ కింద ఏర్పడే గోతులు. శ్రీశైలం డ్యామ్ వద్ద ప్లంజ్ పూల్ లోతు 410 అడుగులు ఉంది. . ఇదికూడా డ్యామ్ ముందే ఉంది.

శ్రీశైలం డ్యామ్ నీటి నిలువ సామర్థ్యం 171 టీఎంసీలు , డ్యామ్ లో 885 అడుగులు నీరు నిలువ ఉంటుంది. దాని అడుగునుంచి పునాది 380 అడుగులుంది. ప్లంజ్ పూల్ ని ఇలాగే వదిలేస్తే అడుగుభాగంలో వరదల సమయంలో నీరు వదిలితే మరింత లోతులో గుంత ప్రమాదంలో పడే అవకాశం ఉంది. దీన్ని పూడ్చేయ్యాలని నేషనల్ డాం సేఫ్టీ అధారిటీ ఎప్పుడో సూచించింది. అయినా ప్రయోజనం లేదు. దీనిని టెట్రాప్యాక్ తో పూడ్చేయ్యవచ్చునని కూడా సూచన చేసింది.

