తేనెటీగల జీవితం ఎంత కష్టమైందో తెలుసా.? అది ఎంత త్యాగంతో కూడుకున్నదో తెలుసా..? మనం ఒక స్పూన్ తేనె తాగుతున్నాము అంటే 12 తేనెటీగలు 6 నుంచి 8 వారాల తన జీవితకాలంలో తయారుచేసిన తేనె అది.. ఒక తేనెటీగ తన జీవితకాలంలో ఒక స్పూనులో 12వంతు తేనె తయారు చేస్తుంది.దీనికోసం అది దాదాపు 50 వేల పూల నుంచి మకరందాన్ని సేకరిస్తుంది. అది తేనెటీగల జీవితం. స్పూన్ లో 12వ వంతు తేనెను తొట్టిలో వదిలిన తర్వాత అది చనిపోతుంది. సూర్య చంద్రులు ఉన్నంతకాలం చెడిపోనిది సృష్టిలో తేనె ఒక్కటే. అలాంటి అద్భుతమైన పదార్థాన్ని మనకిచ్చి చనిపోతుంది. అసలు తేనెటీగలు తుట్టెను ఎలా తయారు చేస్తాయో తెలుసా .?క్రమశిక్షణకు, పటిష్టమైన సైనిక వ్యూహానికి ,పనితనానికి తేనెటీగలు నిదర్శనం.
ఆ జాతిలో రాణిగారిదే పెత్తనం..
తేనెటీగలు ఉన్న తుట్టిలో వాటి సంఖ్య ఎక్కువ అయినప్పుడు రాణి తేనెటీగ, సైనిక తేనెటీగలను బయటికి పంపుతుంది. అవి వెళ్లి సరైన చోటును వెతికి ఆ తర్వాత తిరిగి వచ్చి రెక్కలు ఆడించడం ద్వారా తమ నిర్ణయాన్ని తెలియజేస్తాయి. అప్పుడు రాణి తేనెటీగ అక్కడికి వెళ్లి ఆ స్థలం చూసి నిర్ధారించిన తర్వాత తుట్టెను కట్టడం మొదలుపెడతాయి. తేనెతుట్టు కట్టేందుకు కూడా తేన తేనెటీగలు పాత తొట్టిలో తేనె తాగి ఆ తర్వాత వాటి పొట్ట కింద ఏర్పడే జిగురు లాంటి పదార్థాన్ని తుట్టెను పెట్టాలనుకున్న ప్రాంతంలో వదులుతాయి . అలా వదిలి వదిలి కొన్ని వందల తేనెటీగలు కలిసి ఒక బేస్ ఏర్పాటు చేస్తాయి. ఆ తొట్టెను ఏర్పాటు చేస్తున్నప్పుడే లోపల షడ్బుజా కారంలో గదులను ఏర్పాటు చేస్తాయి . ఈ గదులు ఖచ్చితమైన కొలతలతో ఉంటాయి. ఆ తర్వాత దానిలో రెండు భాగాలు చేస్తాయి . పైభాగంలో గదులలో తేనె నిలువజేసి ,కింద భాగంలో లార్వాలు వదులుతాయి . ఇలా ఒక క్రమ పద్ధతిలో తేనెటీగలను పెంచి, వాటిని వారానికల్లా బయటకు పంపుతాయి.
ఇవి కూడా చదవండి.
ఒక రోజైన కాకముందే విగతజీవిగా పెళ్ళికొడుకు

