22.5 C
New York
Sunday, April 5, 2026

Latest Posts

వానపాముల అక్రమ రవాణా ఆపలేరా ?

ప్రకృతికి ప్రాణం పోసే వానపాములకు ముప్పు దాపురించింది. జీవ వైవిధ్యం వాన పాముల విధి. పర్యావరణానికి మేలు చేసే వానపాములతో ఇప్పుడు అక్రమ వ్యాపారం జరుగుతోంది. దీనికి వ్యాపారాత్మక ధోరణలులే దీనికి కారణం. చేపల చెరువులు, రొయ్యల గుంటలు.. ఇలాంటివి ఎక్కువ కావడంతో వానపాములు స్మగ్లింగ్ కూడా ఎక్కువైంది . వానపాములను అక్రమ రవాణా చేయడం నేరమని అటవీశాఖ చెబుతున్నప్పటికీ రవాణా మాత్రం జరిగిపోతోంది. వానపాముల కోసం పల్లెల్లో బ్రోకర్లును ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేస్తున్నారు. వానపాములు జీవవైవిద్యాన్ని కాపాడడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి . మట్టిలో ఉండే వానపాములు మట్టిలోని విలువైన సహజ రసాయనాలను ఎరువుగా మార్చి వాటిని పరిపుష్టం చేస్తాయి.

వానపాములు లేకపోతే జీవవైవిద్యానికి ప్రమాదం

పంటలకు ,సరస్సుల్లో ఉండే చేపలకు, విదేశాల నుంచి వచ్చే వలస పక్షులకు వానపాములు మంచి బలవంతమైన ఆహారం. భూమిని సారవంతం చేసే వానపాములు అక్రమ రవాణా ఇప్పుడు జీవపరిణామానికి, ప్రకృతి పర్యావరణానికి ప్రమాదకరంగా పరిణమించింది . వాన పాములు ఎప్పుడు భూమిలోనే ఉండి తమ శరీరంలోని తేమ ద్వారా ఆక్సిజన్ పీల్చుకునే, కార్బన్డయాక్సైడ్ విడుదల చేస్తుంటాయి .ఆ విధంగా భూమిలో నత్రజని పెరిగేందుకు తోడ్పడుతుంటాయి . తద్వారా చెట్లు కూడా ఏపుగా పెరుగుతాయి .

రొయ్యల, చేపలగుంటలు, పౌల్ట్రీలకు అక్రమరవాణా

పంటలు కూడా బాగా వస్తాయి. ఇలాంటి అపురూపమైన వానపాములను ఇప్పుడు వ్యాపారులు చేపలగుంటలు , రొయ్యలు గుంటలకు ఆహారంగా వేస్తున్నారు . రొయ్యల, చేపల మేత అధిక ధరలకు కొనుగోలు చేసి రావడం రావాల్సిన రావడం కూడా వానపాములకు శాపమైంది. వానపాములను కిలో 500 నుంచి 550 రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారు. అందువల్ల దీనికోసం పల్లెల్లో కూడా వానపాములు పట్టే వారు ఎక్కువయ్యారు.

ఇవి కూడా చదవండి.

ఒక రోజైన కాకముందే విగతజీవిగా పెళ్ళికొడుకు

ఇదేమి కోరిక తాతయ్యా , విచిత్రంగా ఉందే..

భర్తలు ఇంట్లో, భార్యలు బస్సులో..ఉచితం ఎఫెక్ట్.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.