22.5 C
New York
Wednesday, December 10, 2025

Latest Posts

బాష, మెదడు మధ్య విడదీయలేని బంధం

మన మాతృభాష మన ఆలోచనలను, భావాలను, సంస్కృతిని ప్రభావితం చేస్తుందని అందరికీ తెలుసు. కానీ అది మన మెదడు భౌతిక నిర్మాణాన్ని కూడా మార్చేస్తుంది అని చెప్పినప్పుడు,నమ్మాల్సిన తప్పనిపరిస్థితి. జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ కాగ్నిటివ్ అండ్ బ్రెయిన్ సైన్సెస్ శాస్త్రవేత్తలు 2023లో చేసిన పరిశోధనలో ఈ నిజాన్ని ఎమ్మారై ఆధారంగా నిరూపించారు. .మనము చిన్ననాటి నుండి మాట్లాడే భాష మన మెదడులోని వైట్ మ్యాటర్ నిర్మాణాన్ని జీవితాంతం ప్రభావితం చేస్తుందని అధ్యయనం స్పష్టంగా తెలిపింది. వైట్ మ్యాటర్ అనేది నరాల కణాల ఆక్సాన్‌ల సమూహం, ఇది మెదడులోని విభిన్న భాగాల మధ్య సమాచారాన్ని త్వరగా ప్రసారం చేయడానికి సహాయపడుతుంది. ఇది ఎమ్మారై స్కాన్‌లలో బూడిదరంగు పదార్థం  కంటే తేలికగా కనిపిస్తుంది.

Images 16

జర్మన్ భాషలో వాక్య నిర్మాణం కఠినమైనది, పదక్రమం ఖచ్చితమైనది. ఈ కారణంగా, జర్మన్ మాట్లాడేవారి మెదడులో వ్యాకరణం మరియు వాక్య నిర్మాణంను ప్రాసెస్ చేసే ఎడమ అర్ధగోళంలోని ప్రాంతాల మధ్య బలమైన నాడీ తంతువులు కనిపించాయి.అంటే, భాషలోని నియమబద్ధతకు అనుగుణంగా మెదడు తన అంతర్గత “కనెక్టివిటీ లూప్‌లు”ను బలోపేతం చేసుకుంటుంది.అరబిక్ భాషలో వాక్య క్రమం కన్నా పదాల అర్థం, భావం, సందర్భం ప్రధానంగా ఉంటాయి. అలాగే, ఈ భాషకు ఉన్న శబ్ద సౌందర్యం మరియు ధ్వనుల వైవిధ్యం మెదడుపై ప్రత్యేక ప్రభావం చూపుతాయి. అరబిక్ మాట్లాడేవారి మెదడులో సెమాంటిక్స్‌  ప్రాంతాల మధ్య తంతువులు బలంగా ఉండటమే కాక, ఎడమ–కుడి అర్ధగోళాల మధ్య సమన్వయం అధికంగా కనిపించింది.అంటే, భాషలోని భావ వైవిధ్యాన్ని అర్థం చేసుకోవడానికి రెండు అర్ధగోళాలు కలిసి పనిచేస్తున్నాయి.

Images 15

తెలుగు భాష ఒక ద్రావిడ భాషా మణి — ధ్వన్యాత్మకంగా సంపూర్ణమైనది, భావవ్యక్తీకరణలో సమృద్ధమైనది.దీనిలో సందర్భం, శబ్ద రాగం, పదబంధం ముఖ్యపాత్ర పోషిస్తాయి. పరిశోధకులు చెబుతున్నట్లుగా, ఇలాంటి భాషలు  రెండు అర్ధగోళాల మధ్య సహకారాన్ని పెంచుతాయి, ఎందుకంటే భావం, రాగం, లయ, ఉచ్చారణ అన్నీ సమన్వయంగా పనిచేయాలి. తెలుగు మాట్లాడేవారి మెదడులో ఫోనాలాజికల్ మరియు సెమాంటిక్  ప్రాంతాల మధ్య సహకార బంధం బలంగా ఉన్నదని భారతీయ న్యూరో-లింగ్విస్టులు కూడా సూచిస్తున్నారు.అంటే, తెలుగు భాష మన మెదడును శ్రవణాత్మకంగా చురుకుగా, భావాత్మకంగా లోతుగా, ఆలోచనాత్మకంగా సమన్వయంగా తీర్చిదిద్దుతుంది.

Imageforarticle 706 16432942917953107

భాష నేర్చుకోవడం అంటే కేవలం పదాలు కంఠస్థం చేయడం కాదు. అది మన ఆలోచనల దిశను, మెదడు ఆకృతిని, మరియు సమాచార ప్రాసెసింగ్ విధానాన్ని కూడా మలుస్తుంది. డాక్టర్ ఆల్ఫ్రెడ్ అన్వాండర్ నేతృత్వంలోని బృందం, ప్రపంచ ప్రఖ్యాత న్యూరో-లింగ్విస్ట్ డాక్టర్ ఆంజెలా డి. ఫ్రైడెరిసి మార్గ దర్శకత్వంలో ఈ పరిశోధన జరిపింది. ఎమ్మారై ఆధారంగా మాతృభాష మెదడులోని వైట్ మ్యాటర్‌ను ప్రభావితం చేస్తుందని స్పష్టంగా చూపించిన మొదటి అధ్యయనాలలో ఇదొకటి. మన మాతృభాష కేవలం సంభాషణ సాధనం కాదు; అది మన మెదడు లోపలి రహదారులను వేస్తుంది, మన ఆలోచనా విధానాన్ని తీర్చిదిద్దుతుంది, మరియు మన వ్యక్తిత్వాన్ని లోతుగా మలుస్తుంది.అందుకే మాతృభాషను కాపాడుకోవడం అంటే మన మెదడులోని సృజనాత్మకతను కాపాడుకోవడం అన్న మాట వాస్తవం అవుతుంది.

ఇవి కూడా చదవండి.

ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

షర్మిల కొడుకు రాజకీయాల్లోకి ,మేనమామ జగన్ కి పోటీగా

భర్తలు ఇంట్లో, భార్యలు బస్సులో..ఉచితం ఎఫెక్ట్.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.