మానవ కిడ్నీలు రోజూ రక్తంలో ఉండే వ్యర్థ పదార్థాలను వడపోసి బయటకు పంపుతాయి. వాటిలో ముఖ్యమైనది “క్రియాటినిన్”. ఇది కండరాల పనితీరు వల్ల ఉత్పత్తి అయ్యే పదార్థం. సాధారణ స్థాయికి మించి ఉన్నప్పుడు, కిడ్నీల పనితీరు బలహీనమైందని అర్థం. క్రియాటినిన్ 1.8 mg/dL అంటే కొంత జాగ్రత్త అవసరమని చెప్పే సంకేతం. పురుషులు – 0.6 నుండి 1.2 mg/dL వరకు ,మహిళలు – 0.5 నుండి 1.1 mg/dL వరకు ,ఉండాలి. 1.8 అంటే ఈ పరిమితిని దాటి ఉండడం. 60 ఏళ్లు పైబడినవారిలో కిడ్నీ పనితీరు తగ్గడం సహజం, కానీ 1.8 మాత్రం అధిక స్థాయి. దీని అర్థం కిడ్నీల ఫిల్టరింగ్ సామర్థ్యం తగ్గిందని భావించాలి.
శరీరంలో నీరు తగ్గినప్పుడు రక్తం మందగిస్తుంది. క్రియాటినిన్ పెరుగుతుంది. రోజుకు కనీసం 2–3 లీటర్ల నీరు తాగడం చాలా ముఖ్యం. అలాగే వేడి వాతావరణంలో చెమటలు పడితే అదనపు నీరు అవసరం. మూత్రం పల్చగా, తరచుగా రావడం సాధారణ కిడ్నీ పనితీరుకు సంకేతం అని గుర్తించాలి. అలసట, బలహీనత ఎక్కువగా ఉండడం. చేతులు, కాళ్లు, ముఖం ఊబ్బడం.,తక్కువ మూత్రం రావడం లేదా ముదురు రంగులో రావడం. ఆకలి తగ్గిపోవడం, వాంతులు. ఊపిరి పీల్చుకోవడంలో కష్టాలు. చర్మం దురద, గందరగోళం, అధిక రక్తపోటు. ఇవన్నీ కిడ్నీల సమస్యలకు సంకేతాలు అని భావించాలి.
కిడ్నీలు సరిగా పనిచేయకపోతే రక్తంలో విషపదార్థాలు పేరుకుపోతాయి. ఇది హృదయంపై, ఊపిరితిత్తులపై, మెదడుపై ఒత్తిడి తెస్తుంది. తీవ్ర స్థాయిలో “కిడ్నీ ఫెయిల్యూర్”కి దారి తీస్తుంది. చాలా సందర్భాల్లో డయాలిసిస్ అవసరం అవుతుంది. అందుకే తొందరగా పరీక్షలు చేయించడం ముఖ్యం. ఒక వేళ సమస్య లక్షణాలు ఉంటే మందులు వాడకంతోపాటు ఉప్పు తక్కువగా తీసుకోవాలి. ,అధిక ప్రోటీన్, మాంసం తగ్గించాలి,. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. కాఫీ, టీ, మద్యపానం తగ్గించాలి. తాజా నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచాలని వైద్యులు సూచిస్తారు.
ఇవి కూడా చదవండి.
ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

