22.5 C
New York
Friday, April 3, 2026

Latest Posts

పక్షవాతానికి మూలకణ ప్రయోగంలో విజయం

మానవదేహం అంతులేని అద్భుతాలకు నిలయం . ఎంత పరిశోధన చేసినా అది తరగనిది, అనేక రకాల మొండి జబ్బులు పై శాస్త్రవేత్తల పరిశోధనలు కొనసాగుతూనే ఉంటాయి . తాజాగా పక్షవాతానికి సంబంధించి లేదా బ్రెయిన్ స్ట్రోక్ సంబంధించి లేదా గుండెపోటులకు సంబంధించి జ్యూరిచ్ శాస్త్రవేత్తల పరిశోధనలలో ఓ ఆశా కిరణం కనిపిస్తోంది . జ్యూరిచ్ శాస్త్రవేత్తలు మూలకణ చికిత్స ను ఉపయోగించి మెదడు దెబ్బతిన్న ఎలుకల మెదడులోకి వాటిని పంపించి విజయవంతంగా నయం చేశారు . ఇది ఇంకా ప్రయోగ దశలోనే ఉంది . బ్రెయిన్ స్ట్రోక్ అనేది మానవాళికి మరణ శాసనంగా మిగిలిపోయింది . దీనికి పరిష్కారంగా ఎలుకలపై ఈ మూలకణ పరిశోధన జరుగుతుంది. శాస్త్రవేత్తలు మానవ నాడీ మూల కణాలను ఎలుకల్లో దెబ్బతిన్న మెదడులోకి ప్రవేశపెట్టారు . ఆ తర్వాత ఈ మూల కణాలు మెదడులో న్యూరాన్సును ఉత్పత్తి చేసి దెబ్బతిన్న మెదడు కణాలను పునరుత్తేజం చెందేట్టు చేశాయి .

రక్త కణాలను కూడా సరి చేసాయి. మెదడులో ఉత్తేజిత కణాలను ,మృతప్రాయమైన ఉత్తేజిత కణాలను తిరిగి ఉత్తేజపరిచాయి. ఇది ఇప్పుడు మానవుల్లో సంక్రమించే మెదడు వ్యాధులకు ,పక్షవాతం లాంటి వ్యాధులకు ,గుండెపోటు లాంటి వ్యాధులకు ఒక ఆశాకిరణమైన పరిశోధనగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న వైద్య విధానాల్లో 20 నుంచి 30 శాతం మాత్రమే ఈ జబ్బులు విజయవంతం అయ్యే పరిస్థితి ఉంది. అయితే ఎలుకలపై చేసిన ఈ పరిశోధన ఇప్పటివరకు ప్రాథమిక విజయమైంది . దీన్ని మరింతగా అభివృద్ధి చేసి ఇది మానవులపై ఎలా పనిచేస్తుందో చూడాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇదే విజయవంతం అయితే ప్రపంచంలో కోట్లాదిమంది మెదడు సంబంధిత వ్యాధులకు సంబంధించిన రోగులకు ఉపశమనం ఉంటుంది. అయితే దానికి ముందు మానవులపై కూడా ఈ మందును ప్రయోగించి చూడాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి.

ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

షర్మిల కొడుకు రాజకీయాల్లోకి ,మేనమామ జగన్ కి పోటీగా

భర్తలు ఇంట్లో, భార్యలు బస్సులో..ఉచితం ఎఫెక్ట్.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.