హాట్ ఎయిర్ బెలూన్ లలో విహారం..అదో అద్భుతమైన అనుభూతి..హాట్ ఎయిర్ బెలూన్స్ అంటే వేడి గాలిని నింపడం ద్వారా పైకి ఎగిరే విమానాలు. వీటిని తెలుగులో వేడిగాలి బెలూన్లు అంటారు. ఇవి సాహస యాత్రలకు, ఆకాశంలోని అందాలను ఆస్వాదించడానికి ఉపయోగపడతాయి. ఈ బెలూన్లు తేలియాడే శాస్త్రీయ సూత్రం పై పని చేస్తాయి. బెలూన్ లోపల గాలి వేడి చేయబడి నప్పుడు.. అది బయట ఉన్న చల్లని గాలి కంటే తక్కువ సాంద్రతను సంతరించుకుంటుంది. దీనివల్ల బెలూన్ పైకి లేస్తుంది. దీనికి విరుద్ధంగా, గాలిని చల్లబరచడం లేదా వేడి గాలిని ఒక రంద్రం ద్వారా విడుదల చేయడం వల్ల తిరిగి బెలూన్ కిందికి దిగుతుంది.

వేడిగాలి బెలూన్ బుట్టలను సాధారణంగా నేసిన వికర్ లేదా రట్టన్ తో తయారుచేస్తారు. ఈ పదార్థాలు బెలూన్ విమానానికి తగినంత తేలికైనవి, బలమైనవి, మన్నికైనవిగా నిరూపించబడ్డాయి. ఈ బుట్టలు సాధారణంగా చతురస్రాకారం, దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి. ఇవి ఇద్దరు వ్యక్తుల నుంచి 30 మందిని మోసేంత సైజులో ఉంటాయి. విదేశాల్లో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన హాట్ ఎయిర్ బెలూన్ లు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ లోని అందాలను ఆకాశం నుంచి వీక్షించే అవకాశాన్ని ఐటీడీఏ అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇవి కూడా చదవండి.
ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

