22.5 C
New York
Friday, April 3, 2026

Latest Posts

ఒక రోజైన కాకముందే విగతజీవిగా పెళ్ళికొడుకు

75 ఏళ్ళ వృద్ధుడు పెళ్ళైన ఉదయాన్నే శవమయ్యాడు.. ముందు రోజే కొత్తపెళ్ళికొడుకు హుషారుగా ఉన్నాడు. పెళ్లిచేసుకున్నాడు. రాత్రి గడిచిందోలేదో తెలియదు.. తెల్లారేసరికి శవమయ్యాడు. ఇందులో ఏదో తిరకాసు ఉందని బంధువులు గోలపెడుతుంటే , పెళ్లికూతురు మాత్రం తన ముసలి భర్త సంసారం మొత్తం నువ్వే నడపాలి అని తనవద్ద మాట తీసుకున్నాడని , ఇలా అవుతుంది అనుకోలేదని ఏడుస్తోంది. బంధువులు మాత్రం మృతదేహాన్ని శ్మశానానికి తీసుకుపోనీయకుండా , పోస్టుమార్టం చేయించాలని పోలీసులను కోరడంతో , పోలీసులు శవపరీక్షకు హాస్పిటల్ కి పంపారు. జాన్పూర్ కి చెందిన రైతు సంగ్రూరాం భార్య ఏడాది క్రితం చనిపోయింది. అప్పటినుంచి అతడు ఒంటరిగానే ఉంటున్నాడు.

సోదరులు ఢిల్లీలో వ్యాపారం చేసుకున్తున్నారు. పిల్లలు లేకపోవడం, దగ్గర బంధువులు అందరూ దూరంగా ఉద్యోగాలు, వ్యాపారాల్లో ఉండటంతో , ఒంటరితనంతో ఉంటూ ,తోడుకోసం సంగ్రూరాం మళ్ళీ పెళ్లి  చేసుకోవాలనుకున్నాడు. సంగ్రూరాం పెళ్లికోరికను గ్రామంలో అతడి దగ్గర స్నేహితులు వ్యతిరేకించారు. అయినా వినకుండా సోమవారం రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్ళిచేసుకుని, మళ్ళీ గుడిలో కూడా పెళ్లి చేసుకున్నాడు. సోమవారం రాత్రి గడిచిన తరువాత , మంగళవారాని ఉదయానికి చనిపోయాడు.అతడిని పెళ్లిచేసుకున్న మంబావతికి కూడా ఇదివరకే పెళ్లయింది. ఆమెకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తనకు తోడుకోసమే పెళ్లిచేసుకుంటున్నానని చెప్పాడని ఆమె చెప్పింది. రాత్రి బాగా పొడ్దుపోయాకకూడా మాట్లాడుతూనే ఉన్నామని , అకస్మాత్తుగా ఆయన ఆరోగ్యం దెబ్బతినడంతో, హాస్పిటల్ కి తీసుకెళ్లానని , అక్కడే చనిపోయాడని చెప్పింది.

ఇవి కూడా చదవండి.

ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

షర్మిల కొడుకు రాజకీయాల్లోకి ,మేనమామ జగన్ కి పోటీగా

భర్తలు ఇంట్లో, భార్యలు బస్సులో..ఉచితం ఎఫెక్ట్.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.