అమెరికా అధ్యక్షుడు నివాస భవనం వైట్ హౌస్ లో కొన్ని గదులు, వస్తువులను బంగారంతో తాపడం చేయించారని వారాలు గుప్పుమన్నాయి. ఇది నిజమేననని వైట్ హౌస్ అధికారులు కూడా నిర్దారించారట. వైట్ హౌస్ లోని ఓవల్ ఆఫిస్, కాబినెట్ రూమ్ లో టేబుల్స్, కుర్చీలు, తలుపులు, కిటికీలు, ఇలా ప్రతిఒక్క వస్తువులకు మేలైన 24 క్యారెట్ల బంగారంతో తాపడం చేయించారు. ఇదికాక మెట్ల రైలింగ్స్ కూడా బంగారంతోనే తాపడం చేయించారట.. వీటన్నింటికి అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా బిల్లు చెల్లించారని చెబుతున్నప్పటికి , అది నిజంకాదని ప్రజాస్వామ్య సంఘాలు విమర్శిస్తున్నాయి. విదేశీ అతిధులు కూర్చునే ఓవల్ రూమ్ మొత్తం బంగారంతో మెరిసిపొతొందట .
ఈ ఏడాది జనవరి నెలలో రెండోదఫా ఆయన అమెరికా అధ్యక్షుడు అయినా తరువాత ఈ మార్పులకు శ్రీకారం చుట్టారని చెబుతున్నారు. మొదట బంగారం రంగుతో పెయింట్ వెయ్యాలనుకుని, తరువాత దానిని ఏకంగా బంగారంతోనే తాపడం చేసారని తెలుస్తోంది. విలాసవంతమైన ఆఫీస్ గదులు, ఇల్లు డిజైన్ చేసే , ఫ్లోరిడాకు చెందిన జాన్ కార్ట్ వీటిని పర్యవేక్షించారు. అతడే ట్రంప్ స్వంత ఎస్టేట్ లో కొన్ని గదులను బంగారంతో తాపడం చేసారు. అయితే ప్రతి బంగారం తాపడంపై ట్రంప్ పేరు చెక్కించుకున్నాడు. భవిష్యత్తులో తనపేరు శాశ్వతంగా ఉండిపోవాలని ఇలా చేశాడని చెబుతున్నారు.
అమెరికా ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో ఉంది. రైతాంగం కూడా దేశంలో అనేక రకాలైన సమస్యలు ఎదుర్కొంటున్నారు . ఈ పరిస్థితుల్లో అమెరికా అధ్యక్ష నివాసభవనంలో బంగారు తాపడాలు , విలాసాలు, అవసరమా అంటూ అమెరికన్లు సోషల్ మీడియాలో విమర్శలు మొదలుపెట్టారు. దేశంలో నిరుద్యోగం సూచిక పెరిగింది. ట్రంప్ ఆర్థిక విధానాలపై ప్రపంచదేశాల్లో వ్యతిరేకత వస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి చర్యలు చేపట్టడంపై విరసం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి.
ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

