సినిమాల్లో రాజకీయ వాసనలు పెరిగిపోయాయి . రాజకీయాల్లో ఉన్న స్పర్థలు, వైరుధ్యాలు, విభేదాలు ఇవన్నీ కూడా సినిమా రంగంలో ప్రభావితం చూపిస్తున్నాయి . ఏ సినిమా రిలీజ్ అయిన ఆ సినిమా ఏ రాజకీయ పార్టీ నాయకుడు హీరోకు సంబంధించిందో వాళ్లు దాన్ని ప్రమోట్ చేసుకోవడం సాధారణమైపోయింది. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. తమ పార్టీ అభిమాని కానీ హీరో నటించిన సినిమా అయితే రిలీజ్ కి ముందే సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం ప్రారంభిస్తారు. నేరుగా ఆ రాజకీయ పార్టీల కార్యాలయాలు ,రాజకీయ పార్టీల క్రియాశీలక కార్యకర్తలు , సోషల్ మీడియా విభాగాలు ఈ దుష్ప్రచారాన్ని మొదలుపెట్టేస్తాయి.
తాజాగా పవన్ కళ్యాణ్ ఓజి సినిమాపై కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఒక మాఫియా నాయకుడి చరిత్ర ఆధారంగా తీసిన ఓ జి సినిమాకు ఇప్పుడు ఫాన్స్ లో పెద్ద క్రేజ్ ఏర్పడింది. తెలంగాణలోని ఓ ప్రాంతంలో ఓ అభిమాని ప్రీమియర్ షో టికెట్‌ను వేలంలో లక్షన్నరకు పైగా ధరపెట్టి కొనుక్కున్నాడు. అలాగే వివిధ ప్రాంతాల్లో ఓ జి ప్రీమియర్ సినిమా టికెట్లు వేలు ,లక్షల్లో పోతున్నాయి . ఈ డబ్బంతా జనసేన పార్టీకి విరాళంగా ఇస్తామని అభిమానులు చెబుతున్నారు . పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి ఓ జి సినిమాకు ఇలా క్రేజ్ పెరుగుతుండడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది .
సినిమాలోని సన్నివేశాలను పదేపదే ఫోటోలు రూపంలో చూపిస్తూ విమర్శల దాడి మొదలుపెట్టింది . సినిమా ఫ్లాప్ అవుతుందని, ఇది తప్పకుండా జరిగిపోతుందని చెప్తుంది . వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు , అభిమానులు గాని ఈ సినిమా చూడవద్దు అని కూడా నేరుగా పోస్టులు పెట్టి పరిస్థితికి వచ్చేసారు. ఇటీవల ప్రీమియర్ షో కు ఆయుధాలతో పోయిన అభిమానుల ఫోటోలు కూడా చూపిస్తూ పవన్ కళ్యాణ్ తన అభిమానులకు ఇలాగే సందేశం ఇస్తాడా..? ఇలాంటి హింసను ప్రేరేపిస్తాడా..? ఇలాంటి హింసను ప్రోత్సహిస్తాడా ..?? అంటూ పోస్టింగులు పెట్టి రిలీజ్ కి ముందుగానే సినిమాను నిర్వీర్యరం చెయ్యాలని ప్లాన్ చేసింది.
ప్రజల్లో దానికి చెడ్డ పేరు తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు . ఇవన్నీ కూడా ఇప్పుడు సర్వసాధారణం అయిపోయాయి . ఒకప్పుడు రాజకీయాలకు దూరంగా ,సామాజిక విలువలే స్ఫూర్తిగా నిర్మించే సినిమాలు ఇప్పుడు లేవు. సినిమా రంగం అశ్లీలంతో , బూతు డైలాగులతో, అతిశయోక్తులతో బ్రష్టు బొట్టు పోయిన మాట వాస్తవం . వీటన్నింటికీ తోడు రాజకీయం కూడా సినిమా రంగంలో చొరబడడంతో సినిమా రంగమే దుర్గంధ భూ ఇష్టంగా ఉందన్న నిజం.
ఇవి కూడా చదవండి.
ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

