శాసనసభను బహిష్కరించిన వైసిపి నేత శాసనమండలిని ఎందుకు బహిష్కరించలేదు..? ప్రత్యక్షంగా ప్రజలచేత ఎన్నికైన ఎమ్మెల్యేలను మాత్రం అసెంబ్లీకి దూరంగా ఉంచి, తానూ బహిష్కరించి , జీతాలు , ప్రయోజనాలు మాత్రం పొందుతూ అసెంబ్లీకి పోవడంలేదు. చట్టాలు చేసేందుకు, అర్ధవంతమైన చర్చలకు, ప్రజాసమస్యల ప్రస్తావనకు శాసన సభ సరైన వేదిక. కానీ ఆయనమాత్రం దానికి దూరంగా ఉంటూ , కౌన్సిల్లో అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. అసలు జగన్ అసెంబ్లీకి పోకుండా ఉండటానికి కారణం , కారకులు స్పీకర్ అయ్యనపాత్రుడు , మరియు డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్..
జగన్ సీఎంగా ఉన్న సమయంలో అయ్యన్నపాత్రుడిని కేసులతో వేధించారు. పగలు రాత్రి తేడాలేకుండా ఇంటిమీదకు పోలీసులను పంపించి మానసికంగా హింసలు పెట్టాడు. డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు, సంగతి సరేసరి. తనతో విభేదించనంత కలం నియోజకవర్గానికే కాదు, ఆయన స్వగ్రామానికి కూడా రాకుండా చేసాడు. పోలీసులు కేసులు, లాకప్ లో హింసలు .. ఇలాంటివాటితో చిత్రహింసల సినిమా చూపించాడు. పవన్ కళ్యాణ్ ని కూడా అసభ్యంగా దూషించాడు. ఆయన వ్యక్తిగత జీవితాన్ని ప్రతిసభలో దుయ్యబట్టారు. అసలు రాజకీయాలకే పనికిరాడని , ప్యాకేజి స్టార్ అని తిట్టిపోశాడు. ఇలాంటి వ్యక్తులు అసెంబ్లీలో స్పీకర్, డెప్యూటీ స్పీకర్ స్థానాల్లో ఉంటే వారిని గౌరవించాల్సిన తప్పని పరిస్థితి.
అది జగన్ స్వభావానికి విరుద్ధం. ఆదేశాలు ఇవ్వడమే తప్ప , ఆదేశాలు తీసుకునే తత్వం కాదు జగన్ ది. అలాంటిది తన చేతిలో చిత్రహింసలు పడ్డవారు , అధ్యక్ష స్థానాల్లో ఉండటం, తనకు హేళనగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి హోదాలో, తనకంటే రెండింతలు ఎక్కువమంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో ఉండటం జగన్ జీర్ణించుకోలేడు. ఆయన తత్వానికి అది విరుద్ధం. వీటన్నింటికి మించి , లోకేష్ ని మంత్రిగా, చంద్రబాబుని సీఎంగా చూడలేని అసహాయ పరిస్థితి. గెలిచిన ఎమ్మెలేల్లో కూడా తనకు అండగా పోరాడే శక్తి ఉన్నవాళ్లు లేకపోవడం , చర్చలలో అవగాహనతో మాట్లాడేవాళ్ళు తక్కువకావడంతో ఆయన అసెంబ్లీకి పోయేందుకు ఇష్టపడటంలేదు. తనకున్న 11 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష హోదా రాదని తెలిసినా , చట్టప్రకారం అది కుదరదని తెలిసినా , ప్రతిపక్ష హోదాకావాలని డ్రామా వేస్తున్నాడు. కానీ అసలు కారణం మాత్రం , కానీ వారిని ఉన్నతస్థానాల్లో చూసి ఓర్వలేనితనం.
ఇవి కూడా చదవండి.
ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

