పిల్లుల కిడ్నీల రహస్యం తెలిస్తే మనుషుల్లో కిడ్నీ వ్యాధులకు అద్భుతమైన పరిష్కారం దొరుకుతుంది . ఎందుకో తెలుసా..? పిల్లులకి కిడ్నీలు ఒక ప్రత్యేకమైన నిర్మాణంలో ఉంటాయి. ఇతర జంతువులు ,మనుషుల కంటే పిల్లుల కిడ్నీల ప్రత్యేకత వైద్యశాస్త్రానికి పాఠాలు నేర్పుతుంది. సృష్టిలో రకరకాల ప్రాణుల్లో పిల్లలకు ఉన్న ఒక విశిష్టత వాటి కిడ్నీల నిర్మాణమే .
సాధారణంగా సముద్రపు నీటిని తాగేందుకు భూమి మీద ఉన్న ఏ ప్రాణి కూడా సాహసించదు . అయితే ఒక పిల్లి మాత్రమే సముద్రపు నీటిని తాగగలదు. తాగడమే కాదు ఆ సముద్రపు నీటిని మంచినీళ్లుగా కూడా మార్చుకోగల శక్తి పిల్లి కిడ్నీలకే ఉంది. అంటే సముద్రపు నీటిని ఫిల్టర్ చేసి మంచినీళ్లుగా మార్చుకునే జీవ వైవిద్యం ,జీవసంబంధమైన ఒక ప్రత్యేకత పిల్లులకు సొంతం . అందుకే పిల్లుల కిడ్నీల మీద పరిశోధనలు ఊపందుకున్నాయి..
పిల్లుల కిడ్నీలు అత్యంత సమర్థవంతంగా పనిచేస్తాయి. సముద్రపు నీటిలో ఉండే వ్యర్థాలను, లవణాలను తీసివేసి మంచినీటిని మాత్రమే పిల్లుల కిడ్నీలు తీసుకుంటాయి. అందువల్ల పిల్లులు మంచినీరు దొరకని సమయాల్లో కూడా సముద్రపు ఉప్పు నీటిని తాగుతూ తమ శరీరంలో నీటి శాతాన్ని క్రమబద్ధం చేసుకుంటాయి . దీనికి కారణం పిల్లలకు కిడ్నీలో ఉన్న ఒక ప్రత్యేకమైన నిర్మాణమైన అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మనుషులు , జంతువులు ఎక్కువ స్థాయిలో ఉప్పునీటిని తీసుకుని భరించలేరు . అలా చేస్తే శరీరం డిహైడ్రేషన్ గురవుతుంది. ప్రాణాలు కూడా పోయే ప్రమాదం కలుగుతుంది. అయితే పిల్లుల్లో కిడ్నీల్లో మాత్రం సముద్రపు నీటిని మంచినీరుగా మార్చే ప్రక్రియ ఇప్పుడు ప్రయోగాలకు ఊతమిచ్చింది. ఈ రహస్యం తెలిస్తే అనేక కిడ్నీ వ్యాధులను నయంచేయ్యొచ్చు. అదే పరిశోధనలకు కారణమవుతుంది .
ఇవి కూడా చదవండి.
ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

