తన ఇంట్లో తానే నగలు చోరీచేసి భర్తపై దొంగతనం నేరం మోపి, ప్రియుడితో లేచిపోవాలని ప్లాన్ చేసిన ఓ భార్య.. ఈ ఉదంతంలో ట్విస్ట్ ఏమిటంటే , ఆమెకు 18 ఏళ్ళ తన కూతురు బాయ్ ఫ్రెండ్ తో కూడా సంబంధం ఉంది. ఈ నిజాలు తెలిసి పోలీసులే షాక్ అయ్యారు. ముంబైలో బృహన్ ముంబై కార్పొరేషన్లో రమేష్ అనే ఉద్యోగి ఇంట్లో 10 లక్షలరూపాయలు విలువజేసే నగలు పోయాయి. ఈ మేరకు ఆయన భార్య ఊర్మిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త పైనే అనుమానం ఉందనికూడా చెప్పింది. పోలీసులు విచారణలో ఆమె చెబుతున్న విషయాలకు పొంతనలేకపోవడంతో , అనుమానమొచ్చి దర్యాప్రును వేగం చేసారు.
ఆమె ఫోన్ లో కాల్ రికార్డ్స్ పరిశీలించారు. ఓ వ్యక్తితో తరచుగా ఫోన్ లో మాట్లాడుతున్నట్టు గుర్తించారు. మరో యువకుడు నంబర్ కూడా ఉంది. అతడితోనూ ఆమె కాంటాక్ట్ లో ఉంటుంది. ఇద్దరినీ పిలిపించి విచారించారు. తన ప్రియుడికి ఆమె నగలు ఇచ్చి , అమ్మేయమని చెప్పిందని తేలింది. నగలు అమ్మగా వచ్చిన 10 లక్షల్లో 7 లక్షలు ప్రియుడికి , మూడు లక్షలు తన కూతురు బాయ్ ఫ్రెండ్ కి ఇచ్చిందని పోలీసు విచారణలో తేలింది.
కూతురు బాయ్ ఫ్రెండ్ తో కూడా ఆమెకు అక్రమ సంబంధం ఉందట. ఈ విషయం ప్రియుడికి, కూతురికి తెలియకుండా దాచిపెట్టింది. నగలు అమ్మినతరువాత , ఆ నేరం భర్తపై మోపి , అతడిని జైలుకి పంపి , ప్రియుడుతో , కూతురు బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చెయ్యాలని వేసిన ప్లాన్ ఇలా బెడిసికొట్టి , ఆమెను, ప్రియుణ్ణి ,జైలుకు పంపేసింది..
ఇవి కూడా చదవండి.
ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

