రాజకీయపార్టీలకు, నేతకు కార్యకర్తే, కర్త, కర్మ, క్రియ.. అనే నినాదంతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే మరో వినూత్న కార్యక్రమం చేపట్టారు. నెల రోజుల్లో వెయ్యి మంది కార్యకర్తలు నాయకులతో కార్యకర్తతో నేను అనే కార్యక్రమం చేపట్టారు. నెల్లూరు రూరల్ రాజకీయాలలో సరికొత్త కార్యక్రమం ఇలా పురుడు పోసుకుంది. ఈ కార్యక్రమం ద్వారా కార్యకర్తల మరియు వారి కుటుంబ సభ్యుల కష్టాలను తెలుసుకోవడం ప్రధాన ఉద్దేశం. ,సాధారణంగా ఎన్నికల సమయంలో మాత్రమే ఎమ్మెల్యేలు తమ కార్యకర్తలు, నాయకులతో అభిప్రాయ సేకరణ చేస్తూ ఉంటారు. కానీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా ఇటీవల ఇలాంటి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేని సమయంలో, తన నియోజకవర్గ కార్యకర్తలు,నాయకులతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. గడచిన మూడు రోజులుగా, రోజుకు దాదాపు నలభై మంది కార్యకర్తలు, నాయకులతో వన్ టూ వన్ గా మాట్లాడుతున్నారు. ఒక్కో కార్యకర్తతో పది నుండి పదిహేను నిమిషాల పాటు వ్యక్తిగతంగా మాట్లాడుతుండడం విశేషం. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం పనితీరుపై, ఎమ్మెల్యేగా తన పనితీరుపై లేదా ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డి పనితీరుపై లేదా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇతర నాయకుల పనితీరుపై ఏవైనా ఫిర్యాదులు ఉంటే నేరుగా తనతో చెప్పమని ఈ సందర్బంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోరుతున్నారు.అంతేకాదు, స్థానిక సమస్యల పరిష్కారంలో అధికారుల తీరుతేన్నెలపై కూడా వివరంగా ఆరా తీస్తున్నారు.
ఈ వన్-టూ-వన్ సమావేశాల్లో కేవలం రాజకీయ సమస్యలే కాక, ప్రతి కార్యకర్త కుటుంబ ఆర్థికస్థితి, జీవనోపాధి, వారి పిల్లల చదువుల గురించి కూడా ఆయన అడిగి తెలుసుకుంటున్నారు. అవసరమైనచోట తగిన సహాయం కూడా చేస్తున్నట్టు చెబుతున్నారు.30 రోజుల పాటు కొనసాగనున్న ఈ కార్యక్రమంలో, దాదాపు వెయ్యిమంది కార్యకర్తలతో మాట్లాడాలన్నది ఎమ్మెల్యే గారి ప్రణాళిక. ఈ నెల 18వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో, ఒక వారం విరామం తీసుకుని తిరిగి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారాన ఎమ్మెల్యే కార్యాలయం నుండి సమాచారం. .కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేపట్టిన ఈ పర్సనల్ టాక్ విత్ వన్-టూ-వన్ కార్యక్రమం, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోందని నెల్లూరు రూరల్ ప్రజానీకంలో హాట్ టాపిక్ గా మారింది.
ఇవి కూడా చదవండి.
ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

