22.5 C
New York
Sunday, April 5, 2026

Latest Posts

రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడన ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణశాఖ ప్రకటించింది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్యదిశగా పయనించే అవకాశం ఉన్నట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

రానున్న 24 గంటల్లో అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, జిల్లాలకు అతిభారీ వర్ష సూచన జారీ చేశారు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు ఆరెంజ్ హెచ్చరికలు కూడా అధికారులు జారీ చేశారు. అల్పపీడన ప్రభావంతో సముద్ర తీరం వెంబడి గంటలకు 40 నుంచి 50కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు కూడా వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి.

ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

షర్మిల కొడుకు రాజకీయాల్లోకి ,మేనమామ జగన్ కి పోటీగా

భర్తలు ఇంట్లో, భార్యలు బస్సులో..ఉచితం ఎఫెక్ట్.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.