ఉచితంగా వస్తుంటే ఫినాయిల్ కూడా అమృతంగా తాగేస్తారు.. అని పెద్దలనేవారు. దీనిలో అతిశయోక్తి ఉన్నప్పటికీ బస్సుల్లో మహిళలకు ఉచితప్రయాణం మొదలుపెట్టిన తరువాత మహిళల ప్రయాణం విపరీతంగా పెరిగింది. ఫ్రీ బస్సు కాబట్టి మగాళ్లు ప్రయాణం మానేసి మహిళలను పంపుతున్నారు. దీనితో గతంలో ఆర్టీసీ ప్రయాణీకులతో పురుషులు 60, మహిళలు 40 శాతంగా ఉండేది. ఉచితప్రయాణం తరువాత మహిళలు 60 శాతం, పురుషులు 40 శాతానికి పడిపోయింది. ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం అమలులోకి వచ్చిన తరువాత బస్సు శాతం 126 శాతం ఉంది. గతంలో ఇది 60 శాతం ఉండేది. అంటే గతంలో కంటే మహీళలు ఇప్పుడు వందశాతం ఎక్కువ ప్రయాణాలు చేస్తున్నారు.
ఉచితబస్సు మహిళల్లో యెంత మార్పు తెచ్చిందో చూడండి. ఈ లెక్కలు చెప్పింది సాక్షాత్తు ఆర్టీసీ ఎండి ద్వారక తిరుమలరావు, గతంలో బస్సుల్లో మహిళల ప్రయాణం కేవలం 40 శాతం మాత్రమే ఉండేదని, పురుషులది 60 శాతమని తెలిపారు. శ్రీ శక్తి పథకం అమలులోకి వచ్చిన తరువాత పరిస్థితి పూర్తిగా మారిందని, ప్రస్తుతం మహిళల ప్రయాణం 60 శాతానికి పెరిగి, పురుషులది 40 శాతానికి తగ్గిందని వివరించారు. ఈ పథకం ప్రభావంతో కొన్ని డిపోలలో బస్సుల ఆక్యుపెన్సీ రేటు 100 శాతం పెరిగిందని చెప్పారు.
పేద మహిళలు, విద్యార్థినులు, ఉద్యోగాల కోసం ప్రయాణించే వారు, దినసరి కూలీలు ఈ పథకం వల్ల ఆర్థికంగా ఉపశమనం పొందుతున్నారని పేర్కొన్నారు. బస్సుల్లో మహిళలు మరింత ధైర్యంగా, సౌకర్యవంతంగా ప్రయాణిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. పక్క రాష్ట్రంలో మాదిరి ఇక్కడ బస్సుల్లో కీచులాటలు, కొట్లాటలు లేవన్నారు. మహిళలఉచిత ప్రయాణం సదుపాయాలు , పరిస్థితిని సమీక్షించేందుకు తానే కొన్ని డిపోలలో పర్యటిస్తున్నానని అన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం కారణంగా ఏర్పడ్డ రద్దీని దృష్టిలో పెట్టుకొని త్వరలో వందకుపైగా ఎలెక్ట్రిక్ బస్సులు తెప్పిస్తున్నామన్నారు.
ఇవి కూడా చదవండి.
ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

