22.5 C
New York
Wednesday, December 10, 2025

Latest Posts

ఈ బరువులు ఎందుకు వేలాడ తీశారో తెలుసా

చాలా సందర్భాల్లో ముఖ్యమైన వాటిని మనం గుర్తించం. అవి ఎందుకు ఉన్నాయో కూడా ఆలోచించం . కనీసం మనతో వచ్చే పిల్లలు అడిగినా చెప్పలేని పరిస్థితి. రైల్వే ట్రాక్ వెంబడి ఓవర్ హెడ్ ఎలక్ట్రికల్ లైన్ స్తంభాలకు చాలా చోట్ల బరువులు వేలాడదీసి ఉంటాయి . గుండ్రటి ఇనుప పలకలను ఓ సిలిండర్ ఆకారంలో పెట్టి వేలాడదీసి ఉంటారు . ఈ బరువులు ఎందుకు వేలాడదీశారో మనం ఆలోచించ లేకపోయినా పిల్లలు అడుగుతారు . అవి ఎందుకు అలా వేలాడదీశారు అని. అలాంటప్పుడు కొంతమందికి పిల్లల సందేహం తీర్చలేని చెప్పలేని పరిస్థితి . అసలు ఓవర్ హెడ్ ఎలక్ట్రికల్ లైన్ కు ఈ బరువులు ఎందుకు వేలాడ తీశారో తెలుసా .?

వాతావరణ పరిస్థితిని బట్టి రైల్వే ఓవర్ హెడ్ లైన్ విద్యుత్ వైరు సంకోచ వ్యాకోచాలు చెందే అవకాశం ఉంటుంది . అందువల్ల అలాంటి అవకాశాలు సంభవించినప్పుడు ఈ బరువులు ఆ విద్యుత్ లో సంకోచ వ్యాకోచాలను క్రమబద్ధం చేస్తాయి . వాటికి అనుగుణంగా విద్యుత్ తీగని పట్టి ఉంచుతాయి . ఒక క్రమ పద్ధతిలో ఉండేట్టు చేస్తాయి . తద్వారా విద్యుత్ వైర్లకు ప్రమాదం జరగకుండా లేదా అవి తెగిపోకుండా లేదా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూసే ప్రదాన బాధ్యత వీటిపై ఉంటుంది. అందుకని ఈ బరువులు విద్యుత్ వైర్లకు వేలాడ తీస్తారు . ఇది మనం రైల్లో పోతున్నప్పుడు ఇదీ ట్రాక్ వెంబడి కనిపించే ఈ లోహపు బరువు బరువుల కథ

ఇవి కూడా చదవండి.

ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

షర్మిల కొడుకు రాజకీయాల్లోకి ,మేనమామ జగన్ కి పోటీగా

ఈ బరువులు ఎందుకు వేలాడ తీశారో తెలుసా .?

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.