దేవుడు, దేవత లేని గుడి ఉంటుందా..? ఖచ్చితంగా ఉంటుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ప్రయాగలో అలోపి శక్తి పీఠం విశిష్టమైనది. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఆలయంలో ఏ దేవతా విగ్రహం ఉండదు. విగ్రహానికి బదులుగా చెక్క బండి లేదా ‘డోలి’ ఉంటుంది. దానినే భక్తులు దేవతగా భావించి భక్తితో పూజిస్తారు.. అలోపి అంటే అదృశ్యమైన అనే అర్ధం. దానికి మూలమే ఈ ఆలయం. విగ్రహమే లేవి ఈ ఆలయం గురించి ఓ కథ ప్రచారంలో ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులతో, భయంకరమైన బందిపోటు దొంగలు విస్తృతంగా తిరిగే కాలంలో, అడవి గుండా ఒక వివాహ ఊరేగింపు వెళుతుంది.
మధ్యయుగ కాలంలో బహుమతులుగా పొందిన బంగారం, ఇతర సంపదలతో వివాహ ఊరేగింపుగా పోతున్నప్పుడు దొంగలు , వివాహ బృందాన్ని ముట్టడించారు. పురుషులందరినీ చంపి, సంపదను దోచుకున్నారు.. తర్వాత దొంగలు వధువు ఉన్న ‘డోలీ’ లేదా బండిదగ్గరకెళ్ళి ఆమె నగలు దోచుకోవాలనుకున్నారు. వారు డోలీని సమీపించినప్పుడు లోపల ఎవరూ లేరని గుర్తించారు. వధువు అద్భుతంగా అదృశ్యమైనట్లు కనుగొన్నారు.ఆ విధంగా ఈ కథనం తిరిగి, తిరిగి చరిత్ర లేదా పురాణం కథనంగా మారింది.ఈ సంఘటన జరిగిన ప్రదేశంలో ఒకఆలయ నిర్మాణం జరిగింది.స్థానికులు వధువును “అలోపి దేవి” లేదా ‘కనుమరుగైన కన్య దేవత’ అని పూజించడం ప్రారంభించారు. ఆమె లేదుకనుక ఆమె వదిలిపోయిన డోలీ లేదా పల్లకిని దేవతగా పూజించడం ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి.
ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

