ఏడో తేదీ అంటే ఆదివారం నాడు ఏర్పడబోయే సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావం పై రకరకాల భయాలు ,అపోహలు, అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి . విశాల విశ్వంలో ఖగోళ శాస్త్రానికి సంబంధించి గ్రహణాలు ఏర్పడడం అనేది సృష్టి మొదలైన కాలం నుంచి వస్తున్న ఖగోళ పరిణామం ,. ఇది సృష్టి అద్భుతాలలో ఒకటి . గ్రహాల సంచారంలో సూర్యుడికి చంద్రుడికి మధ్య రాహు గ్రహం నీడపడడంతో దానివల్ల ఏర్పడే గ్రహణాలకు జ్యోతిష్య శాస్త్ర పరంగాను ,సాంకేతిక పరంగానూ వివిధ కారణాలు ఉంటాయి. అయితే చంద్రగ్రహణ సమయంలో మాత్రం జ్యోతిష్య శాస్త్ర పరంగాను ,శాస్త్ర సాంకేతిక పరంగాను అది మానవులపై కలిగించే ప్రభావం దాదాపు ఓకే అభిప్రాయాన్ని కలిగిఉంది. చంద్రుడు ప్రాణుల మానసిక పరిస్థితికి కారకుడు అని చెబుతారు . చంద్ర గ్రహణం లేదా పౌర్ణమి, అమావాస్య ఇలాంటి రోజుల్లో చంద్రుడి ప్రభావంతో సముద్రాల ఆటుపోటులో మార్పులు వస్తాయి.
మతిస్థిమితం లేనివారిపై ప్రభావం చూపుతుంది. అందుకే వారివిషయంలో అప్రమత్తంగా ఉంటారు. పూర్వకాలం నుంచి కూడా గ్రహణ సమయాల్లోనూ పౌర్ణమి అమావాస్య రోజుల్లోనూ మత్స్యకారులు సముద్రంలో వేటకు పోరు. ఇది శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందక ముందు నుంచి కూడా ఉన్న ఆచారం సాంప్రదాయం . అంటే పూర్వకాలంలో చంద్ర సూర్య గ్రహణాలు ప్రభావం అనుభవం మీద మానవుడు తెలుసుకున్నాడు . సూర్య గ్రహణం సమయంలో అయితే పట్టపగలే చీకటి ఏర్పడినప్పుడు పక్షులు గూళ్లకు తిరిగి వెళ్లిపోవడం ,వాటిలో అలజడి మొదలు కావడం ,పశువులు ఇంటికి వెళ్లడం ఇలాంటివన్నీ మనం చూస్తున్నవే . ఏడో తేదీన ఏర్పడబోయే చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుందని వందేళ్ల తర్వాత ఇలాంటి చంద్రగ్రహణం ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది .
జ్యోతిష్యరీత్యా చంద్ర దశలో ఉన్న వారికి లేదా చంద్రమహదశలో ఉన్న వారికి, చంద్రుడు జాతకంలో ఆరు , ఎనిమిది మరియు 12 స్థానాలలో ఉంటే వారిపై ఈ జ్యోతిష్యగ్రహణ ప్రభావం పడుతుందని చెప్తారు . వీరికి గ్రహణ సమయం మంచిది కాదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది .జ్యోతిష్యశాస్త్రంలో జాతకంలో 6 ,8 , 12 స్థానాలలో చంద్రుడు ఉన్నవారికి గ్రహణ సమయంలో మానసికమైన ఉద్వేగం ,ఆందోళన,శారీరక సంబంధమైన అస్వస్థత ఇలాంటివి కలుగుతాయని చెప్తారు. అందువలన ఆ సమయంలో పూజ ,దైవారాధన చేయమని చెప్తుంటారు . మేష రాశి వారు గ్రహణ సమయంలో భగవద్గీత లోని కొన్ని శ్లోకాలను చదివి 108 సార్లు చంద్ర మంత్రాన్ని పఠిస్తే మంచిది అంటారు . వృషభ రాశి వారు చంద్రుడికి జల సమర్పణ చేస్తే వారి ఆరోగ్యం మెరుగుపడుతుందని అంటారు . అలాగే పంచామృతాన్ని నీళ్లలో కలిపితే కూడా మంచిది అంటారు .
మిధు మిధున రాశి వారు టెంకాయను నీళ్లలో ముంచి దాన్ని అపసవ్య దిశలో తల చుట్టూ తిప్పి ఆ తర్వాత పారే నీళ్లలో ఆ టెంకాయ వేసేయాలని చెప్తారు . కర్కాటక రాశి వారికి ఈ చంద్రగ్రహణం ఒక ప్రత్యేకత . ఎందుకంటే చంద్రుడు స్వస్థానం కర్కాటకం . అందువల్ల కర్కాటక రాశి వారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలని ,పాలు ,పెరుగు తీసుకోకూడదని ,రామ రక్షా స్తోత్రాన్ని చదువుకోవాలని చెప్తారు . సింహ లగ్నం వారు నరసింహ మంత్రాన్ని పాటించాలని చెప్తారు . కన్యా లగ్నం ఉన్నవారు తమ మానసిక పరిస్థితిని కుదుటపరుచుకునేందుకు మహా మృత్యుంజయ మంత్రాన్ని లేదా ఓం నమశ్శివాయ అనే మంత్రోచ్ఛారణను పలుదపాలు చేయాలని చెబుతారు .
తులా రాశి వారు హనుమాన్ చాలీసా పటించాల్సిందిగా జ్యోతిష్య శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు . వృశ్చిక రాశి వారు మరియు ధను రాశి వారు పేదవారికి భోజనం పెట్టడం కానీ మంచి నీరు ఇవ్వడం గాని చేస్తే మంచిది చెప్తారు. అదే సమయంలో గజేంద్రమోక్ష శ్లోకాన్ని కూడా పట్టించమని సూచిస్తారు , మకర రాశి జాతకులు చంద్ర మంత్రాన్ని108 సార్లు ఉచ్చరించాలని సూచిస్తారు కుంభ రాశి వారికి విష్ణు స్తోత్రం పఠిస్తే మంచిదని చెప్తారు . మీన రాశి వారు గురు ప్రభావరాశి కాబట్టి మహా మృత్యుంజయ మంత్రం పఠించాలి . ఇలా చేస్తే మానసిక ప్రశాంతత కలుగుతుందని శాస్త్రం చెబుతొంది.
ఇవి కూడా చదవండి.
ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

