కొన్ని నమ్మలేని నిజాలు ఉంటాయి . అంటే అవి నిజాలే గానీ మనం నమ్మలేము . అలాంటి నమ్మలేని నిజమే ఓ మర్రి చెట్టు అరెస్టు కథ. ఈ మర్రిచెట్టు ఇప్పటికీ 127 ఏళ్లయింది. అంటే 127 ఏళ్లుగా ఆ మర్రిచెట్టు అరెస్టులోనే ఉంది. చెట్టుని అరెస్ట్ చేసారుకదా , అదెక్కడికిపోకుండా దానికి పోలీసులు పెద్ద పెద్ద చైన్ లు వేసి బంధించేశారు . అక్కడ బోర్డు కూడా పెట్టేసారు. ఈ చెట్టుని అరెస్ట్ చేశామని. అప్పట్లో పెట్టిన బోర్డు ఇప్పటికీ అలాగే ఉంది . ఇదేదో పిచ్చి తుగ్లక్ చేసిన పనికాదు, సినిమాలో కామెడీ సీన్ అంతకంటేకాదు. ఓ తాగుబోతు మిలిటరీ అధికారి చేసిన పిచ్చి పని. ఇప్పటికీ అలాగేఉంది.
ఇంతకీ నమ్మలేని ఏ నిజం ఏంటో తెలుసా..? 1898లో పాకిస్తాన్లో లండి అనే ప్రాంతంలో సైనిక స్థావరం ఉండేది . బ్రిటిష్ సైనిక స్థావరం నుండి జేమ్స్ స్క్విడ్ అనే మిలిటరీ అధికారి తాగిన మైకంలో మిలిటరీ మెషిన్ చూస్తూ ఆ చెట్టు ఏదో తన మీదకు వచ్చి పడుతున్నట్టు తనను తరుముకుంటున్నట్టు అది ఎప్పుడు తను ఆ దారిన భోజనానికి అక్కడేఉన్న మెస్ కి పోతున్నాడు. తాగినమైకంలో ఆ చెట్టు నీడ చూసి అది తనకి అడ్డం వస్తూ ఉందని భావించాడు. అది దెయ్యపు చెట్టు అని , తనను వెంబడిస్తుందని , తరుముకుంటుందని భయపడి దాన్ని అరెస్ట్ చెయ్యమని ఆదేశించాడు. కాబట్టి సైనికులు వెంటనే దానికి చైన్ లేసి బంధించి ఆ గొలుసులను భూమిలో పాతిపెట్టి గునపాలకు కట్టి పెట్టేసారు .
ఇక చెట్టు తన మీదకు రాదు అని అని భరోసా ఇచ్చేశారు . అప్పటినుంచి ఇప్పటివరకు ఆ చెట్టు అలాగే ఇనుప గొలుసులు మధ్య ఉండిపోయింది. అక్కడ బోర్డు కూడా అలాగే ఉంది . తాగిన మైకంలో ఇదేదో దయ్యం చెట్టు అనుకుని దాన్ని అరెస్టు చేయించిన ఆ బ్రిటిష్ అధికారి ఇప్పుడు లేడు .అతడు చనిపోయి 90 ఏళ్లయింది. అయినా ఇప్పుడు అతడు చేసిన పిచ్చిపని ఇంకా అలాగేఉంది. అతడి పేరుని చిరస్థాయి చేసింది. అదిప్పుడు ఓ పెద్ద యాత్ర స్థలం . చాలామంది యాత్రికులు ఈ చెట్టును సందర్శిస్తున్నారు . ఆ నాటి తాగుబోతు మిలటరీ అధికారి పిచ్చితనాన్ని తాగిన మైకంలో అతని ప్రవర్తించిన తీరును మనం చేసుకుంటుంటారు.
ఇవి కూడా చదవండి.
ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

