15 ఏళ్లు పైబడిన వాహనాలకు పెట్రోల్ పోయొద్దని ఢిల్లీ సర్కార్ ఆదేశం జారీ చేసింది. దీంతో పెట్రోల్ కారు కొన్న 15 ఏళ్లకు తుక్కు కింద డంపింగ్ యార్డుకు పంపాల్సిందే , లేదా ఇతర రాష్ట్రాల్లో అమ్మేసుకోవాల్సిందే. కాలుష్య నియంత్రణ , కలం తీరిన వాహనాల విషయంలో ఢిల్లీ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో కారు ఓనర్లు డీలాపడి పోయారు. ఢిల్లీలో డీజిల్ వాహనాలను ప్రభుత్వం ఇదివరకే నిషేదించిన విషయం తెలిసిందే .

15 ఏళ్లకు మించిన వాహనాలకు పెట్రోల్ అమ్మకూడదని ఏప్రిల్ ఒకటి నుంచి నిబంధనలు అమలు చేయబోతున్నారు. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో పర్యావరణాన్ని కాపాడటానికే ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలో కాలుష్యంతో నిండిన నగరాలలో ఢిల్లీ పదో స్థానంలో ఉంది. మన దేశంలో 10 కాలుష్య నగరాలలో మూడో స్థానంలో ఉంది. వాహనాల కాలుష్యాన్ని ముందుగా తగ్గించాలన్న నిర్ణయాన్ని కఠినంగా అమలు చేయబోతున్నారు.

