గబ్బిలాలకు అంధత్వం ఉందని చాలామంది అనుకుంటారు కానీ గబ్బిలాలకు అందత్వం లేదు అవి చాలా బాగా చూడగలవు కాకపోతే రాత్రుళ్ళు కూడా వాటి కళ్ళలో ఉండే ఫోటో రిసెప్టర్ కణాలు చాలా సున్నితంగా ఉండి చీకటిబడిన తర్వాత కూడా ఎదుటి వస్తువులను మనకంటే బాగా చూడగలిగే శక్తిని కలిగే ఉన్నాయి . పగలు మామూలుగా మనిషి కళ్ళలాగే అవి కూడా బాగా చూడగలవు. సృష్టిలో ప్రతి ప్రాణి ,ప్రకృతిలో ప్రతి మొక్క నేటి ఆధునిక విజ్ఞానానికి పాఠాలు నేర్పింది . వాటి నుంచే నేటి సాంకేతిక పరిజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందుతోంది . మానవుడు ప్రాణులు పైన ,మొక్కలపైన చేసే పరిశోధనలు వీటన్నిటికీ నేటి సాంకేతిక ప్రగతికి మూలాధారం. దానికి ఉదాహరణ గబ్బిలాల వేట.
గబ్బిలాలు వేట నుంచి అల్ట్రా సౌండ్ లేదా లేజర్ బీమ్ కిరణాలు లేదా అల్ట్రా సౌండ్ ఎఫెక్ట్స్ , మాగ్నటిక్ ఫీల్డ్ , అకౌస్టిక్ వలయం , ఇలాంటివన్నీ కూడా శాస్త్రవేత్తలు కనుగొన్నారు . చాలామంది అనుకున్నట్టు గబ్బిలాలు గుడ్డివికావు. మనకంటే వాటికి చూపు బాగుంటుంది. రాత్రుళ్ళు మనలాగే కళ్ళు కనపడవు , కానీ అవి వేటకు రాత్రి సమయంలోనే పోతాయి. అవి చీకటిలో వేటాడే విధానం తెలుసుకునే నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం చూసే చాలా వరకు నేర్చుకుంది .
ఎకో లోకేషన్ సిస్టం అన్న విధానంలో అవి వేట సాగిస్తాయి. ఎకో లోకేషన్ సిస్టం అంటే మానవుడికి చెవులకు వినిపించని ఒక రకమైన శబ్దాలను గబ్బిలాలు ప్రసారం చేస్తాయి . ఇవి ఒక పరిధిలో ప్రసరించి తమ వేటగా పనికొచ్చే ఆ ప్రాణిని తాకి మళ్లీ వెనక్కి వస్తాయి . అలా వెనక్కి వచ్చినప్పుడు గబ్బిలాలు తమ వేటడాల్సిన ప్రాణి ఎంత దూరంలో ఉంది అని అంచనా వేసుకుని వేటాడుతాయి. అంటే వేటకు పనికొచ్చే ప్రాణిని ఇవి శబ్ద తరంగాలను ప్రసారం చేసి, అవి వాటిని తాకి మళ్ళీ వెనక్కి వస్తాయి .
దీన్నిబట్టి వేట ప్రాణికి , తమకు మధ్య దూరాన్ని కూడా గబ్బిలాలు అంచనా వేసుకొని వేటాడుతాయి. దీన్నే ఎకో లోకేషన్ సిస్టం అని అంటారు . దీని ఆధారంగానే అది వేటాడుతుంది. చూశారుగా గబ్బిలం వేట నుంచి మన సైన్స్ నేడు ఎన్నో అద్భుతమైన విషయాలను కనుగొంది . అది ప్రకృతి ప్రాణులకు సృష్టించిన సహజ ధర్మం . నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో సూత్రాలు ఫార్ములాలు ప్రయోగాలు ఇవన్నీ కూడా వాటి నుంచి వచ్చాయి. ఇలాంటివి ఎన్నో కూడా ప్రకృతిలో నుంచే మానవుడు ఆధునిక విజ్ఞానాన్ని పెంపొందించుకున్నాడు.
ఇవి కూడా చదవండి.
ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

