తెలంగాణ పులిబిడ్డ కేసీఆర్ ఇప్పుడు పిల్లిగా మారిపోయాడా.. ? కుటుంబంలో కలతలు, కలహాలను కూడా అచేతనంగా చూస్తుండి పోవలసిన దుస్థితికి కేసీఆర్ దిగజారిపోయాడా..? ఒకప్పుడు కేంద్రం మెడలు వంచి , తెలంగాణ సాధనకోసం అన్నిరకాలుగా రాజకీయ టక్కుటమారా విద్యలతో , ప్రత్యేక తెలంగాణను సాదించుకున్నాడు. తెలంగాణ సాధించుకున్న తరువాత , తనకు ఉద్యమంలో అండగా నిలబడ్డ ఒక్కక్కరినీ పక్కనపెట్టేసాడు. ఏకచత్రాధిపత్యంగా ఏలాడు. చివరకు పార్టీని ఓటమి పాలుజేసి , ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యాడు..
రెండో దఫా అధికారంలోకి వచ్చినప్పటినుంచి పాలనలో కేసీఆర్ కుటుంబం పెత్తనం ఎక్కువైంది. అన్నిరకాలుగా సంపాదించారన్న ఆరోపణలున్నాయి. అప్పట్లో బిజెపి మీద, రాష్ట్రంలో టిడిపి మీద గుడ్డి వ్యతిరేకతతో రాజకీయాలు చేసాడు. తెలంగాణాలో ఉన్నది కారిపోతున్నా, పట్టు జారిపోతున్నా జాతీయరాజకీయాల్లో వేలుపెట్టి కాల్చుకున్నాడు. వీటన్నింటి ఫలితమే ఈ ఓటమి . ఇప్పుడు రాబోయేకాలానికి రాజెవరు అన్న విషయంలో అన్నా , చెల్లెళ్ళ పోరులో , హరీష్ రావు శకుని పాత్ర పోషణలో ఉన్నాడు. నిజానికి బిఆర్ ఎస్ లో కేసీఆర్ తరువాత హరీష్ రావు కే ఎక్కువ రాజకీయ అనుచరగణం ఉంది. మండలస్థాయి నుంచి ఆయనకు పరిచయాలున్నాయి. అందువల్ల ఇప్పటికిప్పుడు ఆయన తన పాత్ర పోషిస్తే ఇంటికిపోవడం ఖాయం.
అందుకే తెలివిగా కేటీఆర్ , కవిత మధ్య చిచ్చు రాజేసాడు. కేసీఆర్ ని అటువైపుగా మళ్లించి , ఇవతల వైపునుంచి సెగ పెట్టడం మెదలుపెట్టాడని చెబుతారు. అన్నాచెల్లెళ్లు ఇద్దరూ కీచులాడుకుని చివరకు ఒకరే మిగులుతారు. హరీష్ రావు వ్యూహం ఫలించింది. కేసీఆర్, కవితపై చర్యతీసుకున్నాడు. కవిత పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది. మేనల్లుడి శకుని పాత్ర కేసీఆర్ కుటుంబ రాజకీయాన్ని కాల్చేసింది. ఇప్పుడు కవిత వేరుకుంపటి పెట్టుకుంటుంది.
స్వంతపార్టీని ఏర్పాటుచేసే దిశగా పొతొంది. ఈ మొత్తం రాజకీయ సంక్షోభంలో బిజెపి పాత్ర యెంత అన్నదే ఇప్పుడు చర్చ. బిజెపి ఒక వ్యూహం ప్రకారం ఒక వైపున హారీష్ రావు , మరో వైపున కవితను వాడుకుని , బిఆర్ ఎస్ పార్టీని ముంచేసిందన్నది చివరలో తేలబోయే వాస్తవం. బిఆర్ ఎస్ పుట్టిమునిగితేనే తెలంగాణాలో బిజెపి సులభంగా అధికారంలోకి రాగలదు. ఈ వ్యూహంతోనే బీటలు వారిన బిఆర్ ఎస్ కోటనుని బిజెపి , హరీష్ రావు, కవిత లాంటి వాళ్ళతోనే పడగొట్టించే ప్రయత్నం చేసిందంటున్నారు. ఈ పోరులో చివరకు హరీష్ రావు పొందబోయే ప్రయోజనం ఏమిటో కాలమే నిర్ణయించాలి.
ఇవి కూడా చదవండి.
ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

