నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్ర జరిగిందన్న ఆరోపణలపై పోలీసు శాఖ స్పందించింది . నెల్లూరులోని ఒక హోటల్లో నేర చరిత్ర ఉన్న వ్యక్తులు, డబ్బులు కావాలంటే శ్రీధర్ రెడ్డిని చంపేస్తే సరిపోతుందని చెప్పిన మాటలు సంచలనం కలిగించాయి . ఈ విషయమై సోషల్ మీడియా మరియు ఇతర మీడియాలో విస్తృతంగా వార్తలు ప్రసారం రావడంతో పోలీస్ శాఖ చర్యలు ఉక్రమించింది. దీనికి సంబంధించి చర్చ జరుగుతున్నప్పుడు ఆ వీడియోలో కనిపించిన నలుగురు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.ఈ మాటలు ఎందుకు అనాల్సి వచ్చిందో కూడా విచారణ జరుపుతున్నారు .
అయితే ఈ వీడియోలు ప్రసారం అయిన తర్వాత వీటిపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించక ముందే ,ఆయన ఈ విషయంపై ప్రకటనలు చేయకముందే వైసీపీ సోషల్ మీడియా ఈ విషయంలో అత్యుత్సాహంతో స్పందించింది . బహుశా ఈ నేరం తమ పార్టీ మీదకు ఎక్కడ వస్తుందోనన్న ఉద్దేశంతో వైసిపి సోషల్ మీడియాలో నిన్నటి నుంచి విస్తృతంగా ప్రచారం జరుగుతోంది . ఆ హోటల్ గదిలో ఉన్న నేరచరిత్ర గల వ్యక్తులు వ్యక్తులతో తమకు సంబంధం లేదని వారు గతంలో శ్రీధర్ రెడ్డి సభల్లో కనిపించారని ,ఆయనను సత్కరించిన సందర్భాలు కూడా ఉన్నాయంటూ కొన్ని ఫోటోలను విడుదల చేశారు . విచిత్రం ఏమిటంటే ఈ సంఘటనకు వైసిపి నాయకత్వానికి సంబంధం ఉందని ఎవరూ చెప్పక ముందే వైసీపీ సోషల్ మీడియా ఈ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించింది . ఎందుకిలా చేసింది అన్నది ఇప్పుడు సస్పెన్స్ గానే ఉంది.
మొత్తానికి హోటల్ గదిలో శ్రీధర్ రెడ్డిని చంపితే డబ్బులు వస్తాయన్న విషయంపై చర్చలు జరుగుతున్న సందర్భంలోనే ఉన్న వ్యక్తులు అదుపులోకి తీసుకోవడంతో ఈ కేసులో నిజానిజాలు ఇప్పుడు బయటకు చూస్తే అవకాశం ఉంది . ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూడా ఎమ్మెల్యే కోటారెడ్డి శ్రీధర్ రెడ్డికి ఫోన్ చేసి విచారించింది . ఇది ఇలా ఉండగానే తన హత్యకు హోటల్లో చర్చ జరుగుతుందని కుట్ర జరుగుతోందని మీడియాలో వచ్చిన తర్వాత శనివారం ఉదయం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశారు. ఇలాంటి బెదిరింపులకి లొంగే గుండె కాదని, అనేక పోరాటాలు ,ప్రజా ఉద్యమాల్లో ఆరితేరి కాకలు తీరిన జీవితం తనదని, ప్రజాసేవ కోసం ప్రాణాలకు అయినా తెగించి పనిచేసే తత్వం గల వాడినని చెప్పారు . ఇలాంటి బూటకపు బెదిరింపులకు భయపడే ప్రశ్న లేదని, చావుకు భయపడి తాను ఎన్నుకున్న మార్గాన్నించి పక్కకు ,మళ్లే ప్రశ్న లేదని కూడా స్పష్టం చేశారు . అయితే ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్న ఆ వ్యక్తులు చెప్పే మాటలు పై మొత్తం రహస్యం ఆధారపడి ఉంది.

