నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్ర జరిగిందా..? ఇదివరకే హత్య కేసుల్లో ముద్దాయిలు, నిందితులు ఒక హాటల్ గదిలో సమావేశమై చర్చించారా..? ఇవేదో ఊహాజనితాలు కాదు. పచ్చి నిజాలు. ఈ కుట్రకు సంబందించిన వీడియోలో పాత్రధారుల మాటలు బట్టి హత్యవెనుక భయంకరమైన నిజాలు తెలిసాయి. కోట్లు డబ్బులు కావాలంటే రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని వేసేయ్యడమే మార్గం అన్న మాట వెనుక అర్థమేమిటి..? ఈ హత్యకు కుట్ర తాడేపల్లిలోనే జరిగిందా..? బెంగుళూరులో స్కెచ్ వేసారా ?? ఎన్ని కోట్లా రూపాయలకు డీల్ కూడింది. వైసిపిలో కీలక నేత కనుసన్నలలో ఈ హత్యకు ప్లాన్ చేసారని తెలుస్తోంది.
దీనిలో పావుగా ప్రస్తుతం జైల్లో ఉన్న నిడిగుంట అరుణను వాడుకున్నారని తెలుస్తోంది. ఆమె వైసిపి నాయకత్వానికి అత్యంత ఆప్తురాలు, విధేయురాలు. జగన్ ప్రభుత్వ హయాంలోనే ఆమె వెలిగిపోయింది. అక్రమసంపాదన, సెటిమెంట్లు, ఐపీఎస్, ఐఏఎస్ లతో సన్నిహిత సంబంధాలతో విలాసవంతమైన జీవితం గడిపింది. ఆమె ప్రియుడు శ్రీకాంత్ కి బెయిల్ కోసం లేఖ సంపాదించమన్న ప్లాన్ కూడా వైసిపి లోని కీలక నేత ఆమెకు చెప్పారని తెలుస్తోంది. ఆ లేఖను అధికారులు తిరస్కరించినా , పోలీస్ శాఖలో పలుకుబడితో ఆమె శ్రీకాంత్ కి పెరోల్ సంపాదించగలిగింది. అతడిని పెరోల్ పై బయటకు తెచ్చి ఏమి చెయ్యాలనుకున్నారో ఇప్పుడు సస్పెన్స్ గా ఉంది.
శ్రీధర్ రెడ్డిని చంపడంలో సహకరిస్తే అరుణకు గూడూరు, లేదా సూళ్లూరుపేట అసెంబ్లీ నుంచి టికెట్ కూడా ఇస్తామని ఆశపెట్టారని చెబుతున్నారు. శ్రీధర్ రెడ్డిని చంపితే డబ్బులొస్తాయన్న చర్చల్లో శ్రీకాంత్ ప్రస్తావన ఎందుకొచ్చిందో ఇప్పుడు తెలుస్తోంది. ఈ వీడియో ఇప్పుడు పోలీస్ నిఘా అధికారుల వద్ద ఉంది. ఎమ్మెల్యేగా శ్రీధర్ రెడ్డికి పెద్దగా భద్రత ఉండదు. ఆఫీస్, ఇంటిలో ఎప్పుడైనా , ఎవరైనా ఏ సమయంలో అయినా ఆయనను స్వేచ్ఛగా కావచ్చు.
వీరిలో ముఖపరిచయం లేనివారు కూడా ఎక్కువమంది ఉంటారు. అందువల్ల శ్రీధర్ రెడ్డిని చంపడం తేలికైన పని అని ప్రత్యర్థులు భావించి ఉండొచ్చు. వైసిపిలో రాజకీయ కలకలానికి శ్రీధర్ రెడ్డి కారణమన్న ఒక అబిప్రాయం కూడా ఆ పార్టీలో బలంగా ఉంది. నెల్లూరు టౌన్లో బలమైన కార్యకర్తల బలగం ఉన్న నేతగా పేరుంది. రాజకీయంగా ఎదుర్కోవడం కష్టమనే ధోరణిలోనే ఆయన హత్యకు వ్యూహరచన జరుగుతొందన్న అనుమానానికి ఈ వీడియోలో మాటలే నిదర్శనం. రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని వేసేస్తే యెంత డబ్బయినా ఇస్తారు.. అన్న మాటలే దానికి సాక్ష్యం.. దీంతో శ్రీధర్ రెడ్డికి భద్రత విషయంలో కూడా ఇప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితి.

