నేషనల్ హైవేస్ అధారిటీ టోల్ ప్లాజాలలో ఫాస్టాగ్ విధానం ప్రవేశపెట్టిన తరువాత . వసూళ్ళలో అభివృద్ధి సాధించినా , చాలావరకు జాతీయరహదారుల మరమ్మతులు, విర్వహణ, ప్రయాణీకుల సౌకర్యాల విషయంలో ఉదాసీనత ధోరణిలో ఉంది. టోల్ ప్లాజాలు చాలావరకు సౌకర్యాల విషయంలో వెనుకంజలోనే ఉన్నాయి. నాసిరకం నిర్మాణాలస్థానంలో మంచి టోల్స్ రాలేదు. టోల్స్ లో ప్రయాణీకుల సౌకర్యాలు విషయంలో శ్రద్దలేదు. డబ్బులు వసూలు పైనే దృష్టిపెట్టి , దానిలో సక్సెస్ అయ్యారు. ఇటీవల తాజాగా ప్రవేశపెట్టిన ఏడాది పాటు అమలులో ఉండే టోల్ పాస్ ల విషయంలో కూడా నాలుగు రోజుల్లోనే రికార్డ్ సాధించారు.
గత నాలుగు రోజుల్లోనే ఫాస్టాగ్ ఐదు లక్షల ఏడాది పాస్ లు జారీచేసింది. ఈ పాస్ లు జారీచేయడం ద్వారా నాలుగు రోజుల్లోనే ఫాస్టాగ్ అకౌంట్ కు 150 కోట్ల రూపాయలు రెవెన్యూ వచ్చింది. ఫాస్టాగ్ వినియోగం పెరుగుతున్న తీరు చూస్తే, భవిష్యత్తులో మరింత డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కి దారి తీస్తుందని నిపుణుల అంచనా వేస్తున్నారు. ఫాస్టాగ్ ఏడాది పాస్ లు ఏడాదిపాటు అమలులో ఉంటే , టోల్స్ వద్ద నిర్వహణ వ్యయం తగ్గుతుంది. వెయిటింగ్ టైం కూడా ఆదా చేస్తే , తద్వారా ఇంధనం ఆదా అవుతుంది.
ఇలాంటి ఆలోచనలతో ఏడాదిపాటు అమలులో ఉండేవిధంగా ఈ పాస్ లు అమలు చేసారు. ఏడాది పాస్ లు ఉన్నవారికి ప్రత్యేకంగా టోల్ వే కూడా ఏర్పాటు చేస్తున్నారు. సాధారణంగా అయితే టోల్ ప్లాజాలవద్ద , 10 సెకన్లు కంటే ఎక్కువసేపు వాహనం ఆగే పరిస్థితుల్లో టోల్ కట్టనవసరంలేదు. వాహనాల క్యూ కూడా 100 మీటర్లకు దాటితే , టోల్ కట్టించుకోకుండా పంపెయ్యాలి. అయితే ఈ నిబంధనలు కాగితాలకే పరిమితం. ఆచరణలో శూన్యం. ఒకవేళ నిలదీస్తే గొడవలు, కొట్లాటలు.. అందుకే వాహనాల యజమానులు మాట్లాడకుండా , టోల్ ఫీజు కట్టేసి పోతుంటారు.

