22.5 C
New York
Wednesday, December 10, 2025

Latest Posts

ఆ కాలేజీలో మెడిసిన్ కోర్సు పూర్తిగా ఉచితం.

వైద్యం వ్యాపారం అయిపోయింది. ఎంబిబిఎస్ మరియు ఆ తర్వాత మెడిసిన్ లో పీజీ కోర్సులు కోట్లు ధార బోసి సీట్లు సంపాదించుకోవాల్సిన దుస్థితి. మెడిసిన్ చదివేందుకు కోట్లు దార పోసి సీట్లు కొట్టేసిన మెజారిటీ విద్యార్థులు ఆ తర్వాత డాక్టర్లయి రోగులను పీడించి వైద్య విద్యను వ్యాపారంగా మార్చి కోట్లు గడిస్తున్న దుస్థితి. ఇది నేటి ప్రపంచ పరిస్థితి . వైద్యరంగంలో నిజమైన సేవ, నిఖార్సైన వైద్య పేదవాడికి , మధ్యతరగతి వాడికి గగనకుసుమైపోయింది. ఇల్లు , వాకిలి, తాళి ఇవన్నీ అమ్ముకుని వైద్యం చేయించుకున్నప్పటికీ సరైన వైద్యం చేయలేని , వైద్యంపై సరైన అవగాహన లేని డాక్టర్లే నూటికి 80 మంది ఉన్నారు. అందువల్ల ఆ తర్వాత కూడా రోగాలు రోస్టులు లేదా మృత్యువే శరణ్యం . ఇలాంటి దౌర్భాగ్యపు పరిస్థితిలో నేటి ప్రపంచ వైద్య రంగం కొట్టుమిట్టాడుతుంది . దానిలో సామాన్యుడు బలైపోతున్నాడు .

Cvr awsom 7 14 25 732x384

బహుశా ఇవన్నీ చూసి ఓ మహాతల్లి, ప్రపంచంలో కోటీశ్వరురాలు ఉచితంగా వైద్య విద్యను చెప్పేందుకు అమెరికాలోని ఆర్కేన్సాస్ లో ఓ పెద్ద మెడికల్ కాలేజీ పెట్టింది. ఆ మెడికల్ కాలేజీలో వైద్య విద్యతో పాటు చరిత్ర , నైతిక విలువలు, దైవం, దైవభక్తి , మానవత్వం ఇలాంటి సబ్జెక్టులుపై కూడా క్లాసులు ఉంటాయి. ఆ తర్వాత మూడో సంవత్సరం నుంచి పల్లెల్లో పేదలకు సేవ చేయడం, పల్లెలోనే నిద్రపోవడం చెయ్యాలి. మూడు గంటలు కాలేజీ మిగిలిన సమయం పల్లెల్లో పేదవారి కోసం పనిచేయడం .. ఇది ఆ కాలేజీ నేర్పించే వైద్యం మరియు మానవత్వంతో కూడిన విద్య. దాదాపు 3 వేల కోట్ల రూపాయలతో ఆలిస్ వాల్టెన్ అనే మహిళ ఈ మెడికల్ కాలేజీని అలెస్ ఎల్ వాల్టెన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పేరుతో జూలై నెలలో ప్రారంభించింది .

Cvr awsom greenroof 7 14 25

2000 మంది ఈ కాలేజీలో చేరేందుకు అప్లికేషన్ పెట్టుకుంటే , వారిని వడబోసి 48 మందిని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నారు. అమెరికాలోని ఆర్కాన్సాస్ లో ఉన్న మెడికల్ కాలేజీ కనీస సదుపాయాల విషయంలో ఆ దేశంలోని 50 రాష్ట్రాల్లో గాను 48వ స్థానంలో ఈ మెడికల్ కాలేజీ ఉంది . అసలు ఈ మెడికల్ కాలేజీ ప్రారంభించాలన్న ఉద్దేశం ఆమెకు ఎందుకు కలిగిందో తెలుసా ..? 1980లో ఆమెకు కారు ప్రమాదం లో కాలు విరిగిపోయింది. వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేశారు. అయితే ఆపరేషన్ తర్వాత ఆమెను అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టేశాయి.

Images 1

ఆపరేషన్ సక్సెస్ కాలేదు . కోటీశ్వరులు కాబట్టి కోట్లు ఖర్చుపెట్టి మూడు సంవత్సరాలకు మామూలు మనిషి కాగలిగింది. ఆమెకు వైద్య కళాశాల పెట్టాలన్న ఆలోచన అప్పుడే కలిగింది . తను కాకుండా వేరే పేదరాలికి ఇలాంటి పరిస్థితి వస్తే ఎలాగన్నది ఆమె ఆలోచన . చేసింది. కనీస పరిజ్ఞానం లేని వైద్యులను పుట్టించే వైద్య కళాశాల వల్ల ఉపయోగం ఏమిటి అన్న ఆలోచన కూడా వచ్చింది. ఈ ఆలోచనలే అత్యుత్తమమైన ఒక మెడికల్ కాలేజీ స్థాపనకు మరియు ఆశయం ,ఆసక్తి ,సేవాగుణం ఉన్న వారిని మొదటిని ఎంపిక చేసి వారికి ఆ విధంగానే శిక్షణ ఇచ్చి మానవత్వమున్న , ప్రజలకు మంచి చేయాలన్నడాక్టర్లను తయారుచేయాలన్న ఉద్దేశం కలిగింది . అందుకే ఈ ఉచిత వైద్య కళాశాల మొదలుపెట్టింది.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.