నాగరికత పెరిగే కొద్దీ ఆహార అలవాట్లు కూడా మారిపోతున్నాయి . ఆహార అలవాట్లతోపాటు ఆరోగ్యం కూడా దెబ్బతిని పోతోంది . ఇటీవల కాలంలో చిన్న పెద్ద అందరూ ఒక ఫ్యాషన్ గా నమిలే చూయింగ్ గమ్ అత్యంత ప్రమాదకరమైన పదార్ధంగా తయారయింది . ఈ చూయింగ్ గమ్ ప్రమాదకరమైన ప్లాస్టిక్ కణాలమయం. కొంతమంది డాక్టర్లు కూడా అనాలోచితంగా పేషంట్లకు చూయింగ్ గమ్ చేస్తున్నారు . నోటిలో దవడల ఎక్సర్సైజ్ కు దీన్ని సూచిస్తున్నారు. దీనిపై వైద్య శాస్త్రవేత్తలు తీవ్రమైన హెచ్చరికలు చేసారు. పిల్లలకైతే చూయింగ్ గమ్ అంటే ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుంది. గంటలు తరబడి నములుతూ , బుడగలు సృష్టిస్తూ అలాగే గడిపేస్తుంటారు .
పిల్లలే కాదు చాలామంది పెద్దలు కూడా ప్రయాణాల్లోనూ లేదా ఇతర ఆఫీసు కార్యక్రమాల్లోనూ చూయింగ్ గమ్ నములుతుంటారు. మరి కొంతమంది అయితే ఏదైనా అలవాట్లు మానేందుకు చూయింగ్ గం నమలడం అలవాటుగా చేసుకున్నారు . అయితే ఈ చూయింగ్ గమ్ ఎంత ప్రమాదమో శాస్త్రవేత్తలు ఇప్పుడు తేల్చారు. ఒక గ్రామ్ చూయింగ్ గంలో 600 నానో ప్లాస్టిక్ కణాలు ఉంటాయి . ఆ ప్లాస్టిక్ కణాలు చూయింగ్ గం నమలడం మొదలు పెట్టిన తరువాత రెండు నుంచి ఎనిమిది నిమిషాల లోపల రక్తంలోకి ,ఊపిరితిత్తుల్లోకి ,కాలేయంలోకి ,కిడ్నీలోకి చేరిపోతాయి అలా శరీరంలోకి చేరిపోయిన నానో ప్లాస్టిక్ కణాలు అత్యంత ప్రమాదకరమైనవి . ఇవి క్యాన్సర్ కారకాలు. కనీసం 10 నుంచి 15 ఏళ్ల తర్వాత ఈ క్యాన్సర్ ప్రభావం మనిషి ఆరోగ్యం మీద చూపిస్తుంది

