22.5 C
New York
Saturday, June 13, 2026

Latest Posts

చెవిలో గడ్డిమందు పోసేయ్ ప్రియుడికి భార్య సలహా

కాలం మారిపోయింది. మారిన సాంకేతికత ప్రభావమో ఏమోగానీ భర్తలను భార్యలు చంపే ఘటనలు ఎక్కువవుతున్నాయి. తాజాగా యూట్యూబ్‌లో చూసి భర్తను ఎలా చంపాలో ప్రియుడికి చెప్పిన భార్య ఉదంతం సంచలనం రేపింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో సంపత్ స్వీపర్‌గా పనిచేస్తున్నాడు. తన భార్య రమాదేవి, ఇరవై ఏళ్ళ వయసు దాటిన కొడుకు, కూతుర్లను పోషిస్తున్న పోషిస్తూ కుటుంబం నెట్టుకొస్తున్నారు. భార్య రమాదేవి సర్వపిండి విక్రయిస్తుండగా, తరచూ ఆమె వద్ద సర్వపిండి కోసం వచ్చి పరిచయం పెంచుకున్న కర్రె రాజయ్య అనే వ్యక్తి ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వీరి పరిచయం వివాహేతర సంబంధంగా మారడంతో ఎలాగైనా సంపత్ అడ్డు తొలగించుకోవాలని భార్య రమాదేవి పధకం వేసింది.

భర్తను ఎలా చంపాలో యూట్యూబ్‌లో చూసి పథకం వేసిన భార్య రమాదేవి ఎవరి చెవిలోనైనా గడ్డి మందు పోస్తే చనిపోతారని యూట్యూబ్‌లో చూసి అదే పద్ధతిలో హత్య చేయాలని ప్రియుడికి సలహా ఇచ్చింది. పార్టీ చేసుకుందామని రాజయ్య , సంపత్ ని పిలిచి బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద సంపత్‌తో కలిసి మద్యం సేవించిన రమాదేవి ప్రియుడు రాజయ్య అతని స్నేహితుడు శ్రీనివాస్ ఇద్దరూ సంపత్ మైకంలో ఉండగా అతడి చెవిలో పురుగుల మందు పోసి చంపేశారు.

అనంతరం భర్త కనబడటం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తరువాత తన భర్త శవం దొరికిందని తానె పోలీసులకు చెప్పింది.భర్త మృతికి కారణాలు తెలుసుకోకుండా, మృతదేహానికి పోస్టుమార్టం చేయొద్దని అడగడంతో రమాదేవిపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు ఆమె మొబైల్ కాల్ రికార్డ్స్ , యు యూట్యూబ్ పరిశీలించారు. కాల్ డేటా, ఫోన్ లొకేషన్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను అదుపులోతీసుకొని విచారించగా తామే హత్య చేసినట్టు రమాదేవి, రాజయ్య, శ్రీనివాస్అంగీకరించారు. దీంతో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండుకు తరలించిన పోలీసులు.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.