22.5 C
New York
Wednesday, June 3, 2026

Latest Posts

విమానంలో బొద్దింకల పంచాయతీ, విచారణకు ఆదేశం

విమాన సర్వీసులు నిర్వహణ ప్రశ్నార్థకమవుతుంది . విమానాల్లో భద్రత అనుమానాలు అంటే ఆకాశంలో దీపంలా తయారయింది. ఇటీవల కాలంగా ప్రపంచవ్యాప్తంగా రెండు నెలలుగా జరుగుతున్న విమాన ప్రమాదాలు పై ఒకవైపు ఆందోళన కొనసాగుతుండగా మరోవైపు విమానాల నిర్వహణ మాత్రం అధ్వానంగా ఉందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ముంబై వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో బొద్దింకల విషయం గందరగోళానికి దారి తీసింది . విమానంలోకి బొద్దింకలు ఒకటి రెండు కాదు ఎక్కువ సంఖ్యలోనే వచ్చేసాయి.

విమానం బయలుదేరబోతుండగా అమెరికాలో వచ్చాయో లేదా ఇండియా నుంచి విమానంలోనే కాపురం పెట్టాయో గానీ ప్రయాణీకులను యాతన పెట్టేశాయి. బొద్దింకల దెబ్బకు ప్రయాణికులు హడలి పోయారు . ]శాన్ఫ్రాన్సిస్కో కుంచి నుంచి నాన్ స్టాప్ గా ముంబై వస్తున్న ఈ విమానంలో ప్రయాణికులు సీట్ల కింద , సీట్లలోనూ బొద్దింకలు పారాడుతూ ఉండడంతో ఇబ్బంది పడ్డారు . విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసినప్పుడు విమానం గాలిలో ఉన్నప్పుడు తామేం చేయగలమని వాళ్లు కూడా చేతులెత్తేశారు. ఆ తర్వాత మెయింటినెన్స్ కోసం ఈ విమానం కలకత్తాలో ల్యాండ్ అయింది. అప్పుడు ప్రయాణికులంతా గట్టిగా నిలదీయడంతో బొద్దింకలు పారాడుతున్న సీట్లో ఉన్న ప్రయాణికులను వేరే సీట్లోకి మార్చారు.

బొద్దింకలు విషయం తమను ఆందోళన గురి చేసిందని దీనికి తాము తీవ్రమైన విచారం వ్యక్తం చేస్తున్నామని ఎయిర్ ఇండియా ఓ ప్రకటన విడుదల చేసింది . సాధ్యమైనంత వరకు విమానంలో కీటకాలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని, బయలుదేరి పోయేముందు ప్రతి విభాగానికి అన్నింటిని పరిశీలించిన తర్వాతే అనుమతిస్తామని చెప్పింది. అయితే విమానం గ్రౌండ్ లో ఉన్నప్పుడు ఇవి విమానంలోకి వచ్చిఉంటాయని అనుమానం వ్యక్తం చేసింది . ఎంతకీ ఈ బొద్దింకలు అమెరికాలో ఉన్నాయా..? అమెరికా నుంచి ఇండియాకు వచ్చాయా ?? లేదంటే చాలాకాలంగా విమానంలోనే కాపురం ఉన్నాయా అన్న విషయం ఇప్పుడు తేలాల్సింది. దీనిపై ఎయిర్ ఇండియా కూడా సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేసింది.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.