22.5 C
New York
Saturday, June 13, 2026

Latest Posts

అపెండిసైటిస్ ఆపరేషన్ డబ్బు కోసమేనా ?

వైద్యరంగం భారతదేశంలో వ్యాపార ధోరణిలో నడుస్తుందని అంతర్జాతీయ సంస్థలు ఘోష పెడుతున్నాయి. వైద్యంలో మనవాళ్లు మాత్రం పక్కావ్యాపార ధోరణితోనే , దోచుకునే విధానంలోనే ముందుకు సాగిపోతున్నారు. గర్భసంచి ఆపరేషన్లు ,గుండె ఆపరేషన్లు ఇలా అనేక రకాలైన ఆపరేషన్ లు అవసరంలేకపోయినా డబ్బులు కోసమే చేస్తారన్న ప్రచారంలో నిజం లేకపోలేదు. మందుల కంపెనీలకు మేలు చేసే విధంగా పేషంట్లను దోచుకుంటారనడంలో నిజం లేకపోలేదు. ఈ విషయంలో భారతదేశ వైద్యరంగం బ్రష్టు పట్టిపోయిన మాట వాస్తవం . అయితే ఇప్పుడు తాజాగా శాస్త్రవేత్తలు మరో సంచలమైన పరిశోధనలో ఓ నిజం కనుక్కున్నారు. ప్రపంచ దేశాల్లో భారతదేశం లోనే అపెండిసైటిస్ ఆపరేషన్లు ఎక్కువగా జరుగుతుంటాయని,వీటిలో దాదాపు 85 శాతం అవసరం లేని ఆపరేషన్ లని నిర్ధారించారు .

తాజా నివేదిక ప్రకారం అపెండిసైటిస్ అనే ఆపరేషన్ అనివార్య, అత్యవసర పరిస్థితుల్లో తప్ప సాధారణ పరిస్థితుల్లో చేయకూడదు. దానిని తొలగిస్తే ఇబ్బందిలేదని, అది వృధా అవయవమని చెప్పే మాటలు కూడా అబద్దాలేనని తేలింది.మానవుడికి ఇతర అవయవాలు ప్రాధాన్యం లాగానే అపెండిక్స్ కూడా అత్యంత అవసరమైన అవయవం . అయితే మొదటి నుంచి ఈ అపెండిసైటిస్ అనవసర అవయవయం అని ముద్రవేసి , ఇది ఉంటే దీనివల్ల ఇబ్బందులు ఉంటాయన్నసాకు చెప్పి తొలగించేస్తున్నారు. వేల రూపాయలు గుంజేస్తున్నారు . తలా పాపం తిలా పిడకెడు అన్నట్టు మెడికల్ లాబ్స్ తో కూడా లాలూచీపడి దోచి పారేస్తున్నారు. తాజాగా డ్యూక్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ విషయమై విస్తృత పరిశోధన చేసి కనుగొన్నది ఏమిటంటే అపెండిసైటిస్ అనేది వృధాగా ఉండే అవయం కాదని ,దానిలో 200 మిలియన్ న్యూరాన్స్ ఉంటాయని తెలిపారు.

వెన్నుముక సూక్ష్మమైన నరాలు ఎలాగైతే ఒక దాన్ని ఒకటి పెను వేసుకుని ఉండి సమాచార సాధనాలు మెదడుకి మిగతా శరీర భాగానికి చేరవేస్తాయో , సమాచార సాధనంగా పనిచేస్తాయో అలాగే అపెండిక్స్ కూడా ఉదరభాగానికి ఒక శక్తివంతమైన సమాచార సాధనంగా పనిచేస్తుంది. మెదడుకు , ఉదర భాగానికి అనుసంధానం కలిగి ఉంటుందని చెప్పారు . ఇది మంచి బ్యాక్టీరియాకు ఒక రిజర్వాయర్ లాంటిదని ,ఆరోగ్యం బాగా లేనప్పుడు మంచి చేసే బ్యాక్టీరియా తనలో నిలువ చేసుకొని విడుదల చేస్తుందని తెలిపారు. రోగనిరోధక శక్తిని కాపాడడంలోనూ, జ్ఞాపకశక్తిని కాపాడటం లోను ఉదర భాగంలో ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు మెదడుకు సమాచారం చేరవేయడంలోనూ ఇది అద్భుతంగా పనిచేస్తుంది .

 

అయితే ఇప్పుడు అపెండిక్స్ తొలగించబడిన రోగుల్లో దీర్ఘకాలికంగా ఈ ఇబ్బందులు తప్పవని స్పష్టం చేశారు. ఆపెండిక్స్ ను తొలగిస్తే జీర్ణ సంబంధమైన ఇబ్బందులు కూడా ఉంటాయని పేగుల్లో ఇన్ఫెక్షన్స్ కు ఎక్కువ అవకాశం ఇస్తుందని, ఒత్తిడి, ఆందోళన నుంచి ఉదరభాగాన్ని కాపాడుకునే వీలు లేదని డ్యూక్ యానివర్సిటీ శాస్త్రవేత్తలు స్పష్టం చేసారు. దీంతో ఇప్పుడు ప్రపంచ వైద్య రంగం అపెండిక్స్ తొలగించే విషయమై ఆలోచన చేస్తుండగా ,మన దేశంలో మాత్రం హెయిర్ కటింగ్ చేసినట్టు ఈ అపెండిక్స్ తొలగించి పక్కన పారేస్తున్నారు . దీనికి కేవలం డబ్బు సంపాదన , నైతిక విలువలు లేని వైద్యరంగం చేసే పనులుగా భావిస్తున్నారు . అపెండిక్స్ ని తొలగించే బదులు యాంటీబయాటిక్స్ తో దానిని సరి చేయవచ్చని చెబుతున్నారు. దీర్ఘకాలికంగా ఈ అవయవం ప్రాధాన్యతను ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని డాక్టర్లు వ్యవహరించడం లేదని తెలిపారు. అయితే ఇప్పటికే అపెండిక్స్ తొలగించిన వారిలో కొన్ని పద్ధతులు ద్వారా దాన్ని నష్టాన్ని పూడ్చుకోవచ్చునని చెప్పారు.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.