బిల్వ లేదా మారేడు పత్రాలతో పూజ శివునికి ప్రీతికరమైనది. హిందూ సంప్రదాయంలో ఈ ఆకులకు అత్యంత ప్రాధాన్యం, ప్రాముఖ్యత ఉంది. బిల్వ పత్రాలు లేనిదే శివలింగానికి పూజచేయరు. వినాయకుని పూజలోనూ బిల్వ పత్రం అత్యంత ఉత్తమ ఫలాలను ఇస్తుందని చెబుతారు. సంక్రాంతి సమయంలో లేదా సంధ్యా సమయంలో బిల్వ పత్రాన్ని కోయడం మంచిది కాదు. స్నానం చేయకుండా బిల్వ పత్రాన్ని కోయకూడదు. అమావాస్య, సంక్రాంతి, సోమవారం, రిక్త లేదా అష్టమి నాడు బిల్వ ఆకులను కోయకూడదు. ఇలా చేయడం అశుభంగా పరిగణిస్తారు. మరియు ప్రతికూల కర్మ పరిణామాలకు దారితీస్తుందని చెబుతారు.
శివుని ఆరాధనలో బిల్వ ఆకులు అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ప్రతి ఉదయం ఈ ఆకును తీసుకోవడం వల్ల గ్యాస్, అసిడిటీ మరియు అజీర్ణం నుండి బయటపడవచ్చునాని ఆయుర్వేదం చెబుతొంది. . అలాగే, మలబద్ధకం కూడా నయమవుతుందని అంటారు. పైల్స్ ,మూలాల సమస్య ఉన్నవారికి, ఖాళీ కడుపుతో బిల్వ పత్ర తినడం ప్రయోజనకరంగా ఉంటుందని ఆయుర్వేదం చెబుతొంది.
.బిల్వ ఆకు జీర్ణవ్యవస్థను క్రమబద్దం చేసి బలపరుస్తుంది.అయితే దీన్ని ఎక్కువ కాలం తీసుకుంటే ప్రతికూలపరిస్థితులు కూడా వస్తాయి. అందువల్ల ఆయుర్వేద వైద్య నిపుణుల సలహాతోనే ఈ ఆకులు వైద్యానికి ఉపయోగించాలి. సాదరంగా రెమ్మకు మూడు బిల్వపత్రాలు ఉంటాయి. అరుదైన సందర్భాలలో ఆరు లేదా 21 ఆకులున్న బిల్వ పత్రాల రెమ్మలు ఉంటాయి. బిల్వ పత్రాలలో శ్వేత బిల్వ పత్రాలు కూడా ఉంటాయి.

