ఏపీలో లిక్కర్ కుంభకోణం మరో కీలక మలుపు తిరిగింది. హైదరాబాద్ లోని ఒక ఫార్మ్ హౌస్ లో సిట్ అధికారులు 11 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బులు అట్టపెట్టెల్లో పెట్టి దాచిపెట్టారు., గత జూన్ నెలలో ఇక్కడకు డబ్బు తరలించామని వరుణ్ పురుషోత్తం అనే వ్యక్తి చెప్పారు,. ఇతను లిక్కర్ స్కామ్ లో 40 వ నిందితుడుగా ఉన్నారు. ఈ డబ్బు ఎవరిదన్న విషయంలో అతడు ఒక కీలక నేత పేరుచెప్పారని సిట్ అధికారులు చెప్పారని తెలిసింది.

అయితే ఆ నేత ఎవరో కొద్దీ రోజుల్లో బట్టబయలు అవుతుందని చెబుతున్నారు. వైసిపి సీనియర్ నేత ఒకరు ఈ డబ్బు అట్టపెట్టెల్లో పెట్టించి ఇక్కడ పెట్టారని చెబుతున్నారు. 40 వ నిందితుడుగా ఉన్న వరుణ్ విదేశాలకు పారిపోతుండగా అతడిని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వద్ద పట్టుకున్న విషయం తెలిసిందే. అతడు ఇచ్చిన సమాచారం ప్రకారమే 11 కోట్ల రూపాయలు అట్టపెట్టెల్లో దాచిన డబ్బు స్వాధీనం చేసుకున్నారు.

