22.5 C
New York
Wednesday, December 10, 2025

Latest Posts

ఆహారాన్ని వృధాచేస్తే జైలుశిక్ష , జరీమాన .

పేదరికంతో అల్లాడిపోయే దేశాలలో, ఆహారం వృధా చేయడమనేది సర్వసాధారణంగా జరుగుతున్న విషయమే . దానిలో మన భారతదేశం ఎప్పుడు ముందంజలోనే ఉంది . ఇందులో వేడుకలు ,వినోదాలు పేరుతో ఆహారాన్ని వృధా చేయడంలో భారత్ అగ్రస్థానంలోనే ఉంది. అయితే మనలాంటి దేశాలు ఆహారాన్ని వృధా చేయకూడదన్న విషయంలో ఫ్యాన్స్ దేశాన్ని చూసి కొన్ని నేర్చుకోవాల్సి ఉంది . 2016 నుంచి ఫ్రాన్స్ దేశంలో అమలులో ఉన్న చట్టాలు కారణంగా ఏ సంస్థ అయినా లేదా ఏ వేడుకలో కూడా ఆహారం వృధా చేయకూడదు. అలా చేస్తే గరిష్టంగా ఏడేళ్లు జైలు శిక్ష , భారీ జరిమానా విధిస్తారు .

ఇది కాకుండా ఫ్రాన్స్ లో పెట్టే ప్రతి సూపర్ మార్కెట్ ,హోటల్ లేదా ఇతర ఏ ఆహారం పదార్థాలను సరఫరా చేసే సంస్థ అయినా ముందుగా స్వచ్ఛంద సంస్థలు , ధార్మిక సంస్థలు, అనాధ శరణాలయాలతో అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంది. మిగిలిపోయిన ఆహార పదార్థాలను వారికి సరఫరా చేస్తామని ఒప్పందం చేసుకుంటేనే ఆయా సంస్థలకు అధికారులు అనుమతిస్తారు. అన్ని దశల్లోనూ ఆహారం వృధా చేయడాన్ని అరికట్టేందుకే ఇలాంటి చర్య తీసుకున్నారు .

చాలావరకు హోటల్స్ ,సూపర్ మార్కెట్లో లేదా ఇతర ఇతర దుకాణాలు కాలం తీరిపోయిన లేదా అమ్ముడుపోకుండా మిగిలిపోయిన ఆహార పదార్థాలను వాటిపైన బ్లీచింగ్ వేసి ఇతరులు వాడకుండా చెత్తకుప్పల్లో పారేస్తారు . కానీ ఇలా చేస్తే శిక్షలు మరింత కఠినంగా ఉంటాయి. ఒకవేళ మనుషులు తినేందుకు పనికిరాని ఆహారాన్ని, వారు రీసైకిలింగ్ యూనిట్లకు ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇస్తే అవి ఆహారాన్ని రీసైకిల్ చేసి పశువుల ఆహారానికి ఉపయోగపడే విధంగా చేస్తాయి . లేదంటే కంపోస్ట్ యార్డ్లకు తరలించి ఎరువుగా మారుస్తాయి . వృధా అయిన ఆహారాన్ని ఒక అరికట్టడంలో ఫ్రాన్స్ అన్నిదేశాలకంటే అగ్రస్థానంలో ఉంది.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.