శునకాలకున్న గ్రహణ శక్తి అద్భుతం . అమోఘం . పోలీస్ విధుల్లో గాని ,శాంతి భద్రతల పరిరక్షణలో గాని , శత్రువులను పసిగట్టడంలో గాని మాదక ద్రవ్యాలను అరికట్టడంలో గానీ నేరస్తులను కనుగొనడంలో గాని శిక్షణ పొందిన కుక్కల పాత్ర ఆమోఘం .అలాగే మూత్రం వాసన ద్వారా క్యాన్సర్ వ్యాధి లక్షణాలను , గర్భస్థ పరీక్షల నిర్ధారణలోనూ కుక్కలు నమ్మకమైన ప్రతిభ కనబరిచాయి. ఇది బ్రిటన్ శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా కూడా నిరూపించారు.. ఇప్పుడు మరో తాజా పరిణామం.
వృద్ధుల పాలిట శాపంగా మారిన పార్కిన్సన్ వ్యాధిని అది రాకముందే కుక్కలు పసిగట్టగలవని నిర్ధారణ అయింది . ఆ వ్యక్తికి పార్కిన్సన్ వ్యాధి లక్షణాలు కనిపించక ఏడాది ముందే కుక్కలు దాన్ని కనిపెట్టి సంకేతాలను ఇవ్వగలవు. ఆ వ్యక్తి చెమట ,చర్మం వాసన ఈ రెండింటిని కుక్కలు పసిగట్టి ముందుగా నిర్ధారించగలవు ప్యార్ కిన్స్ అండ్ వ్యాధి నిర్ధారణకు సాంప్రదాయంగా నిర్వహించే వైద్య పరీక్షలు కంటే ముందే కుక్కలు దాన్ని కనిపెట్టగలవంటే వాటి గ్రహణ శక్తి ఎంత అమోఘమో అర్థం చేసుకోవచ్చు. పార్కిన్సన్ సోకే వ్యక్తి మెదడులో గాని, శరీరంలో గాని కలిగే రసాయనిక మార్పులను కుక్కలే కనిపెట్టగలవు . అవి వైద్య పరీక్షలకు కూడా అందక ఏడాది ముందే ఇలా కనిపెట్టే శక్తి వాటికి ఉందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.

