తనను నిర్బంధించిన జైలు గదిలో తనకు మరొక తోడుంచాలని మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ వల్లభనేని వంశీ కోర్టును కోరాడు. పోలీస్ కస్టడీకి వంశీకి అనుమతించిన మూడు రోజులు గడువు పోలీస్ కస్టడీ ముగియడంతో ఆయన్ను విజయవాడ కోర్టులో హాజరు పెట్టారు . ఈ సమయంలో న్యాయమూర్తి వంశీని కస్టడీలో ఏమైనా జరిగిందా ? మీకు ఇబ్బంది కలిగించే చర్యలు ఏమన్నా జరిగాయా ?? అని అడిగారు . అయితే తనకు తనను ఉంచిన జైల్లో తన గదిలో తనకు మరొకరిని తోడుగా ఉంచాలని వంశీ న్యాయమూర్తిని కోరాడు . తనకు ఉబ్బసం వ్యాధి ఉందని అందువలన మరొకరు ఉంటే తనకు కూడా ధైర్యంగా ఉంటుందని చెప్పాడు .

అయితే వంశీకి ఇదివరకే కోర్టు ఆయన జైలు గది వద్ద ఒక అటెండర్ను నియమించేందుకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు జైలు వార్డును కూడా తరచూ పరిశీలకు ఉంచారు. జైలు అధికారులు మాత్రం భద్రతా కారణాల దృష్ట్యా వంశీ నొక్కడినే సెల్ లో ఉంచామని ఆయనకి ఏదన్నా అవసరమైతే బయట ఉండేందుకు ఒక అటెండర్ను కూడా ఉంచామని చెప్పారు. అయితే వంశీ మాత్రం తనకి జైల్లో మరొకరు తోడుగా కావాలని ఇందుకు సంబంధించిన దేశాలు ఇవ్వాలని కోర్టును కోరాడు అయితే భద్రతా కారణాల దృష్ట్యా వంశీని ఒక్కడినే జైలు గదిలో ఉంచడంతో మరొకరిని అనుమతించే విషయంలో ఇన్చార్జిగా తనేమి ఆదేశాలు ఇవ్వలేనని కూడా న్యాయమూర్తి చెప్పారు.

