22.5 C
New York
Monday, April 6, 2026

Latest Posts

సాంబార్ లో విషం కలిపి భర్తను లేపేసింది.

ఇదేమిటో, భర్తలకు కష్టకాలం వచ్చేసింది. భార్యలచేతిలో భర్తల హత్యల్లో మరో ట్రెండ్ మొదలయింది. తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో ఓ భార్య , భర్తకు సాంబార్ లో విషం కలిపి భోజనం పెట్టింది. దీంతో అతడు చనిపోయాడు. ఈ సంఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. ధర్మపురి జిల్లాలోని కీరాయిపట్టి గ్రామంలో రసూల్, అమ్ముబీ దంపతులు. రసూల్ కారుడ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య అమ్ముబీ , ఒక హెయిర్ కటింగ్ సెలూన్ యజమాని లోకేశ్వరన్ తో ప్రేమలో పడింది. రసూల్ డ్రైవింగ్ పనికి పోయినతరువాత ఇద్దరూ ఏకాంతంగా కలిసేవారు. లోకేశ్వరం ఇల్లుకూడా పక్కదే కావడంతో ఇద్దరి సంబంధం కొనసాగింది.

చివరకు రసూల్ తో సంసారం ఇష్టంలేదని , అందువల్ల ఏదో ఒకటిచేసి , ఇద్దరం స్వేచ్ఛగా ఉండమని అమ్ముబి ప్రపోస్ చేసింది. భర్తకు అన్నంలో కానీ, జ్యూస్ లో విషం కలిపి ఇస్తానని చెప్పింది. దీంతో లోకేశ్వరన్ ఆమెకు విషం తెచ్చి ఇచ్చాడు. మొదట దానిమ్మ రసంలో కలిపి , భర్తకు ఇచ్చింది. అతడు జ్యూస్ వద్దనడంతో , ఈ జ్యూస్ పారేసింది. మధ్యాహ్నం వచ్చాక , సాంబార్ లో విషం కలిపి , అన్నంపెట్టింది. సాంబార్ అంటే రసూల్ కి చాలాఇష్టం. భోజనం చేసిన రసూల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.

అపస్మారక స్థితికి చేరుకోవడంతో , చనిపోయాడని భావించి , హాస్పిటల్ కి తీసుకెళ్లింది. అక్కడ డాక్టర్లు అతడికి బ్లెడ్ టెస్ట్ చేస్తే , విషప్రయోగం అని తెలిసింది. బ్లెడ్ శాంపిల్ ఫలితం వచ్చేలోగా రసూల్ చనిపోయాడు. అయితే డాక్టర్లు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఆమె మొబైల్ చూడగా , అమ్ముబి ప్రియుడి లోకేశ్వరన్ కి ఇచ్చిన ఒక మెస్సేజ్ ఆమెను పట్టిచ్చింది. నువ్వు తెచ్చిన విషం దానిమ్మ రసంలో కలిపి ఇస్తే, అయన రసం తాగలేదు, అందుకని సాంబార్ లో కలిపి ఇస్తున్నా , అని పెట్టిన మెసేజ్ తో ఆమె , ప్రియుడు ఇద్దరూ చిక్కిపోయారు.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.