చాలామందికి మొబైల్ ఫోన్ తోనే సహవాసం అయింది. ఇంకొంతమందికి మొబైల్ కు ఫోన్ తోనే సహజీవనం అయిపోయింది. మొబైల్ ఫోన్ లేనిదే కాలం స్తంభించబోయే పరిస్థితి . కొంతమందికి అయితే పిచ్చెక్కినట్టు ఉండే పరిస్థితి . ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే ఏడాది బిడ్డలకు కూడా మొబైల్ ఫోన్ ఇచ్చి వారి భవిష్యత్తును ప్రమాదకరం చేస్తూ , ఇబ్బందులకు గురి చేస్తున్నారు . బిడ్డలు అన్నం తినకపోయినా ,పాలు తాగక పోయినా , అల్లరి చేస్తున్నా, మొబైల్ ఫోన్ ఇచ్చేసి తమ పని పూర్తి చేసుకునే తల్లిదండ్రులు ఎందరో లెక్కేలేదు. అయితే ఈ మొబైల్ ఫోను మెదడుపై సృష్టిస్తున్న విధ్వంసం , మెదడుని నాశనం చేస్తున్న తీరు బహుశా ఎవరూ గమనించడం లేదు. గమనించే పరిస్థితి వచ్చేటప్పటికీ మెదడు మళ్లీ బాగు చేయలేని దుస్థితికి చేరుకుంటుంది. ఇది ఇప్పుడు ప్రపంచాన్ని ఆందోళన గురి చేస్తున్న విషయం.

సాంకేతికత అభివృద్ధికి ఎంత దోహదం చేస్తుందో , అంత వినాశనానికి కూడా దోహదం చేస్తుందన్న విషయంలో ఎలాంటి అనుమానాలకు అవకాశం లేదు. ఇటీవల మొబైల్ ఫోన్ సృష్టిస్తున్న విధ్వంసంపై ప్రపంచ శాస్త్రవేత్తలు ప్రధానంగా దృష్టి పెట్టారు. వారి అధ్యయనంలో 30 రోజుల పాటు మొబైల్ ఫోన్ మెదడులో కణజాలాన్ని ఎలా దెబ్బతీస్తుందో కనుగొన్నారు . మొబైల్ ఫోన్ నుంచి వచ్చే విద్యుత్ అయస్కాంత ధార్మిక శక్తి అంటే ఎలెక్ట్రో మాగ్నెటిక్ రేడియేషన్ ప్రభావం మెదడుపై తీవ్రంగా ప్రభావం చూపింది. .మెదడులోని ముఖ్యమైన కణజాలాన్ని దెబ్బతీస్తోంది . ఇది చాలా స్పష్టంగా మైక్రోస్కోప్ దృశ్యాలతో వారు ప్రపంచానికి తెలియజేశారు. సెల్ఫోన్ ఎక్కువసేపు మాట్లాడుతున్నప్పుడు వెలువడే వేడి మరియు విద్యుత్ అయస్కాంత తరంగాల ధార్మికత మెదడులోని కణజాలాన్ని , దానితోపాటు దేహంలోని నాడీ వ్యవస్థను కూడా తీవ్రంగా దెబ్బతీస్తుంది.

ఇది తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమని హెచ్చరించారు. ప్రతిరోజు గంటలు తరబడి ఫోన్లతో సహజీవనం చేసే వాళ్ళకి ,సహవాసం చేసేవారికి లేదా ఎక్కువ కాలం గడిపే వాళ్లకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు . ఇది కాకుండా చిన్న పిల్లల్లో సెల్ఫోన్ అలవాటు చేస్తే అతి సున్నితమైన కణజాలం మరియు నాడీ వ్యవస్థ దెబ్బతింటుందని ఇది క్రమక్రమంగా యుక్త వయసు దాటే లోపలనే జీవితంపై దుష్ప్రభావాలను చూపిస్తుందని కూడా హెచ్చరిస్తున్నారు . సెల్ఫోన్ నిద్రపోయే సమయంలో దిండు కింద పెట్టుకోవడం, తలకు దగ్గరగా ఉంచుకోవడం తీవ్రమైన ఆందోళన కలిగించే అంశం అని చెబుతున్నారు.

ఇది మనిషి ఆరోగ్యం పై తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు . ఒకవేళ ఫోన్ మాట్లాడడమే అవసరం అయితే కొంచెం దూరంగా పెట్టుకొని స్పీకర్ ఫోన్లు ఆన్ చేసి మాట్లాడుకోవడం అనేది కొంతవరకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. వీడియోలు చూసేప్పుడు కొద్దిసేపు మాత్రమే సెల్ఫోన్తో గడిపి ఆ తర్వాత దాన్ని దూరంగా ఉంచడం అనేది ప్రధానమైన పరిష్కారం అని చెబుతున్నారు. సెల్ఫోన్తో ఎక్కువ కాలం గడిపే వాళ్ళు ఆ తర్వాత వచ్చే ఆరోగ్య ప్రభావాలతో చాలా దుష్ప్రభావాలు కలిగి మానసిక ,శారీరిక ,మెదడుకు సంబంధించిన వ్యాధులతో తీవ్రమైన ఇబ్బందులు పడాల్సి వస్తుందని కూడా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

