రాష్ట్రంలో మద్యం కుంభకోణంలో వైసిపి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసారు. ఈ మేరకు మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్ పై కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు.సమాచారం ఇచ్చారు. కోర్టులో హాజరుపరిచే అంశంపై కాసేపట్లో నిర్ణయం.తీసుకోనున్నారు. మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డిని ఏ4గా చేర్చారు. రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి రాకముందు ఉన్న మద్యం పాలసీని జగన్ ప్రభుత్వం సమూలంగా మార్చి , ప్రభుత్వమే నేరుగా మద్యం షాపులు తెరిచింది.
అప్పటివరకు ఉన్న బ్రాండెడ్ మద్యంని ఆపేసింది. అస్మదీయులకు స్వంతంగా డిస్టలరీస్ లీజుకు ఇప్పించి చీప్ లిక్కర్ తయారీకి పూనుకుంది. ఇదికాకుండా డిజిటల్ చెల్లింపులు ఆపేసి, నేరుగా డబ్బుతీసుకునే పనికి శ్రీకారం చుట్టింది. ఈ విధానమే ప్రజల్లో తీవ్రమైన అనుమానాలకు మొదటినుంచి కారణమైంది.
ఈ లావాదేవీల్లో 3 వేల కోట్లకు పైగా కమీషన్లు చేతులు మారాయని , అవి చివరలో మిదున్ రెడ్డికే చేరాయని , ఆయనే వాటిని చేరాల్సిన వ్యక్తికీ , సూట్ కేస్ కంపెనీలు ద్వారా చేర్చారని, ముంబైలో 450 కోట్ల విలువైన డబ్బు బంగారం వ్యాపారులద్వారా కూడా దారిమళ్లించారని చెబుతున్నారు.. ఈ కేసులో బెయిల్ కోసం మిదున్ రెడ్డి అన్ని విధాలా ప్రయత్నం చేసి, చివరకు వీలుకాక పోవడంతో అరెస్ట్ అనివార్యమైంది.

