డిగ్రీలు ,పీహెచ్డీలు., ఎన్నో రీసెర్చ్ పేపర్లు ఉన్నప్పటికీ ఉద్యోగం వస్తే జీతం ఒక లకారం దాటేందుకు నానా కష్టపడాల్సి వస్తుంది . వచ్చిన దాంట్లోనే 30 శాతం ట్యాక్సుల రూపంలో రామార్పణం అవుతుంది. దీనికోసం కష్టపడడమే కాదు రేయింబవళ్లు వొళ్ళు హూనం అయ్యేలా పనిచేయాల్సి వస్తుంది. కానీ ముంబైలో ఓ యువకుడు ఉదయాన్నే ఆషామాషీగా , మార్నింగ్ వాక్ , ఈవెనింగ్ వాక్ చేసి నెలకు నాలుగున్నర లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు.
ఆ వాకింగ్ కూడా కుక్కలతో చేస్తుంటాడు. ఈ ఉద్యోగం పేరు డాగ్ వాకర్. ధనవంతుల కుక్కలను వాకింగ్ కి తీసుకెళ్లి మళ్ళీ ఇళ్ళదగ్గర వదిలేయడం. ఇదీ అతడి దినచర్య. ఇప్పుడు అతడికి కూడా కుక్కలతో వాకింగ్ చేసి ఆరోగ్యానికి ఆరోగ్యం ,జీతానికి జీతం, శారీరక శ్రమకు శారీర శ్రమ అన్నట్టు లక్షణంగా నెలకి నాలుగున్నర లక్షలు సంపాదిస్తున్నాడు. అతను తమ్ముడు ఏమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉండి నెలకి 70000 సంపాదిస్తున్నాడు. ఇంకో తమ్ముడు ఎంబీఏ చదివి 40000 సంపాదిస్తున్నాడు. మనవాడేమో ఇంటర్ చదివి నెలకి నాలుగున్నర లక్షలు జీతం సంపాదిస్తున్నాడు.
అతడు 38 కుక్కలకు వాకింగ్ చేయించే పనికి కుదురుకున్నాడు . ఒక్కో కుక్కకు 15 వేల రూపాయలు తీసుకుంటాడు . ఈ విధంగా నెలకి నాలుగున్నర లక్షలు జీతం చేతికి వచ్చేస్తుంది. దీంట్లో డిగ్రీలు లేవు ,ఆయాసం లేదు, అలసట లేదు, శారీరిక శ్రమ లేదు, బాస్ లేడు , ఏదో అంటారన్న బాధ లేదు. టార్గెట్లు లేవు. జస్ట్ కుక్కలతో నడవడం లేదా కుక్కల్ని నడిపించడం . ఇది ఒక్కటే పని. ఇప్పుడు అర్థమైందా పెద్ద పెద్ద డిగ్రీలు చేసి సంపాదించే వేల కంటే మనవాడు 38 కుక్కల్ని నడిపించి ఒక్కొక్క 15000 లెక్కన నెలకు నాలుగున్నర లక్షలు సంపాదిస్తున్నాడు . ఇది ఒక రకంగా మంచి ఐడియా అని కూడా చెబుతున్నారు.

